Allu Arjun : గంగోత్రి నుండి పుష్ప వ‌ర‌కు.. రూ.100 నుండి రూ.300 కోట్ల వ‌ర‌కు.. బ‌న్నీ అద్భుత‌మైన జ‌ర్నీ

Allu Arjun : గంగోత్రి నుండి పుష్ప వ‌ర‌కు.. రూ.100 నుండి రూ.300 కోట్ల వ‌ర‌కు.. బ‌న్నీ అద్భుత‌మైన జ‌ర్నీ

Allu Arjun : అల్లు అర్జున్.. ఈ పేరు గ‌త కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. పుష్ప ప్ర‌భంజ‌నంతో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న బ‌న్నీ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌టించిన పుష్ప‌2 కోసం అందరు ఎదురు చూశారు.ఆ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద హిట్ అయింది. ఈ క్ర‌మంలో బన్నీకి సంబంధించిన ఆస‌క్తికర విష‌యాలు తెలుసుకునేందుకు అందరు ఆస‌క్తి చూపుతున్నారు. మ‌రోవైపు బ‌న్నీ పుష్ప‌2 సినిమాకి మూడు వంద‌ల కోట్లు అందుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అంతేకాదు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్‌-10 భారతీయ నటుల జాబితాలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

చిరంజీవి బర్త్​డే వేడుకల్లో బన్నీ డ్యాన్స్ వేయగా, అది ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు దృష్టి ఆకర్షించింది. బన్నీని చూసి మురిసిపోయిన ఆయన తన తల్లికి రూ.100 అడ్వాన్స్‌ ఇచ్చి, పెద్దయ్యాక మీ అబ్బాయిని నేను హీరోని చేస్తానంటూ మాటిచ్చారట. అలా ‘గంగోత్రి’ (2003)తో వెండితెరకు పరిచయం అయ్యారు అల్లు అర్జున్.గంగోత్రి త‌ర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్నారు బన్నీ. అప్పుడే సుకుమార్​ ‘ఆర్య’ కథ వినిపించారు. ఇక ఈ చిత్రం బన్నీ కెరీర్​ను ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ‘బన్నీ’, ‘దేశముదురు’, ‘జులాయి’, ‘S/o సత్యమూర్తి’ ఇలా పలు సినిమాలు తన సినీ కెరీర్​లో ఓ స్టెప్పింగ్ స్టోన్స్​గా మారాయి.

కమర్షియల్‌ చిత్రాలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పించారు అల్లు అర్జున్‌. తన ట్యాలెంట్​తో వాటికి జీవం పోశారు. ‘వేదం’లో కేబుల్‌ రాజును ఎవరూ మర్చిపోలేరు .ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు బ‌న్నీ. తన కెరీర్‌లో మానసికంగా, శారీరకంగా ఎక్కువ కష్టపడింది ఆ సైనికుడి పాత్ర కోసమేనని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చారు. ఇక పుష్ప సినిమాలో చాలా రఫ్‌గా క‌నిపించి అద‌ర‌హో అనిపించాడు. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ‘తగ్గేదే లే’ సిగ్నేచర్‌ మేనరిజంతో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం పెట్టడం మరో విశేషం. టాలీవుడ్​లోనే కాదు బన్నీకి మాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే. అందుకే అక్కడి ఫ్యాన్స్​ ఆయన్ను ముద్దుగా ‘మల్లు అర్జున్‌’ అని పిలుచుకుంటున్నారు. షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీతో గడపడాన్ని అసలు మిస్‌ అవ్వరు బన్నీ.