IPPB SO Recruitment : త‌పాలా బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం..

IPPB SO Recruitment : త‌పాలా బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం..

IPPB SO Recruitment : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మ‌ధ్య షార్ట్ నోటిఫికేష‌న్ ను రిలీజ్ చేయ‌గా తాజాగా డీటెయిల్డ్ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా దేశ‌వ్యాప్తంగా ఐపీపీబీ శాఖ‌ల్లో రెగ్యుల‌ర్‌, కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా మొత్తం 68 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్ లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను జ‌న‌వ‌రి 10ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.ippbonline.com/web/ippb/current-openings అనే అధికారిక వెబ్ సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య 68 ఉండ‌గా అసిస్టెంట్ మేనేజ‌ర్ ఐటీ పోస్టులు 54, ఐటీ మేనేజ‌ర్ పేమెంట్ సిస్ట‌మ్స్ పోస్టు 1, ఐటీ మేనేజ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, నెట్‌వ‌ర్క్ అండ్ క్లౌడ్ పోస్టులు 2, ఐటీ మేనేజ‌ర్ ఎంట‌ర్‌ప్రైజ్ డేటా వేర్ హౌస్ పోస్టులు 1, సీనియ‌ర్ మేనేజ‌ర్ ఐటీ పేమెంట్స్ సిస్ట‌మ్స్ పోస్టు 1, సీనియ‌ర్ మేనేజ‌ర్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, నెట్‌వ‌ర్క్ అండ్ క్లౌడ్ పోస్టులు 1, సీనియ‌ర్ మేనేజ‌ర్ ఐటీ పోస్టు 1, సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ కాంట్రాక్టు పోస్టులు 7 ఖాళీగా ఉన్నాయి.

IPPB SO Recruitment 2024 know the full details how to apply

పోస్టుల‌ను బ‌ట్టి బీఈ, బీటెక్ (కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేస‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌) ఉత్తీర్ణ‌త లేదా పీజీ (కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌) లేదా బీఈ, బీటెక్ (ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్‌) లేదా బీఎస్సీ (ఎల‌క్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ) ఉత్తీర్ణ‌త‌తోపాటు ఉద్యోగ అనుభ‌వం ఉండాలి.

01.12.2024 నాటికి అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు 20-30 ఏళ్లు, మేనేజ‌ర్ పోస్టుల‌కు 23-35 ఏళ్లు, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల‌కు 26-35 ఏళ్లు, సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్ పోస్టుల‌కు 50 ఏళ్లు మించ‌కూడ‌దు. నెల‌కు అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.2,25,937, మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.1,77,146, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.1,40,398 వేత‌నం చెల్లిస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.750 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లించాలి. ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్క‌ష‌న్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.