Prabhas : ప్ర‌భాస్ మ‌ర్యాద‌ల‌కి ఫిదా అయిన జ‌గ‌ప‌తి బాబు..కుంభకర్ణుడులా పడుకున్నానంటూ కామెంట్

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆయ‌న టాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ప్ర‌భాస్ సినిమాలంటే జ‌నాలలో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ చిత్రం, క‌ల్కి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ప్ర‌భాస్ ఎంత పెద్ద స్టార్ అయిన చాలా లోగా ఉంటారు. ప్రభాస్ మర్యాదల గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎక్కడా తగ్గరు. ఇంటికి ఎవరు వచ్చినా కడుపునిండా ఫుడ్ పెట్టి పంపిస్తారు. ఇక ప్రభాస్ అయితే తన సినిమాలో పనిచేసే నటీనటులకు రకరకాల ఫుడ్ తో తన మర్యాదల రుచి చూపిస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు, ప్రభాస్ తో పనిచేసినవాళ్లు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడ‌డం మ‌నం చూశాం.

తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు తాజాగా ప్రభాస్ భోజన విందుకి ముగ్ధుడయ్యాడు. భీమవరంలో సినిమా షూటింగ్‌కి వచ్చిన తనకు వివాహ భోజనాన్ని తలపించే భోజనం రాజుగారు పంపించారని.. దీన్ని బకాసరుడిలా తిని కుంభకర్ణుడులా పడుకున్నానని జగపతి బాబు వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా భోజనంతో చంపేయడం భీమవరం రాజులకే సొంతం అని ఆయన ఈ వీడియో రూపంలో తెలిపాడు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు షేర్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.గ‌తంలో దీపికా పదుకోన్, శృతిహాసన్, శ్రద్ధా కపూర్ లాంటి స్టార్లు ప్రభాస్ అతిథి మర్యాదల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ కూడా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ తెగ పొగిడేశారు.

ప్ర‌భాస్ గురించి గ‌తంలో కూడా జ‌గ‌ప‌తి బాబు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ప్రభాస్.. జార్జియాలో ఉన్న సమయంలో జగపతి బాబు డిప్రెషన్‌లో ఉండి తనకు ఫోన్ చేశాడట. ఫోన్ చేసి తన సమస్య ఏంటో చెప్పి డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పాడట జగపతి బాబు. దానికి సమాధానంగా ప్రభాస్.. ‘డార్లింగ్ నేను ఉన్నాను కదా.. నీ సమస్య ఏంటో చెప్పు.. నేను చూసుకుంటాను కదా’ అన్నాడట. అనడం మాత్రమే కాకుండా వెంటనే జార్జియా నుంచి జగపతి బాబును కూడా కలవడానికి కూడా వచ్చాడట ‘ప్రభాస్ అనేవాడు నాకు చాలా ఇష్టమైన మనిషి. ఎందుకంటే తనకు ఇవ్వడం మాత్రమే తెలుసు కానీ అడగడం తెలియదు. ఎవరు అడిగినా, ఏం అడిగినా ఇచ్చేస్తాడు. తను నాకంటే చిన్నవాడే అయినా కూడా స్పందించాడు. నా సమస్యను తీర్చాడు’ అన్నారు జగపతి బాబు.