పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం) 55 ఖాళీలు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొత్తం 55 పోస్టుల్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్-3:3, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2:5, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1:9, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2:2, ప్రాజెక్ట్ అసోసియేట్ 2:2, ప్రాజెక్ట్ అసోసియేట్ 1:32, ప్రాజెక్ట్ మేనేజర్ -1, ప్రాజెక్ట్ కన్సల్టెంట్-1 , ప్రోగ్రామ్ మేనేజర్ 1 ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న పోస్ట్‌లు, విద్యార్హతలు, అనుభవం చూస్తే ముందుగా ప్రాజెక్ట్ సైంటిస్ట్(2)-5: ఎమ్మెస్సీ( అట్మాస్పియరిక్ అండ్ ఓషన్ సైన్స్ లేదంటే మీటియొరాలజీ లేదా రేడియా ఫిజిక్స్ , 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్, టెక్నాలజీ, డిగ్రీ సంబంధింత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఇక ప్రాజెక్ట్ సైంటిస్ట్(1)-9: ఎమ్మెస్సీ( ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ లేదా సైన్సెన్, మీటియోరాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, బీటీక్ , బీఈ,ఈఈఈ, కంప్యూటర్ పరిజ్ఞానం, ఏఐ, ఎంఎల్ నైపుణ్యం ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్(1)-32 చూస్తే ఎమ్మెస్సీ( ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అట్మాస్పియరిక్ సైన్సెస్, ఓషనోగ్రఫీ, క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, టెక్నాలజీ డిగ్రీ, పైతాన్ , సీ లేదా సీ ప్లస్ ప్లస్ నైపుణ్యం ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ -3 పోస్ట్‌కి 45 ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2కి 40 ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి 35 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కి 40, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి 35, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి 35, సీనియర్ ప్రాజెక్ట్ అసొసియేట్‌కి 40, ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్‌లకి 45 సంవత్సరాలు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకి గరిష్ట వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఉద్యోగులు నో అబ్బెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగి కలిగి ఉండాలి.ఇంటర్వ్యూకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, అభ్యర్ధులకి టీఏ, డీఏలు ఇస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. జీతం విషయానికి వస్తే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్ట్‌లకి 78 వేలు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి 67000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి రూ.56వేలు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కి రూ.42వేలు, ప్రాజెక్ట్ అసోసియేట్2కి రూ.28000, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి 25వేల రూపాయలు, ప్రాజెక్ట్ మేనేజర్‌కి 125000 ఇక చివరి తేది డిసెంబర్ 5.