Karthika Deeapam Today December 2 Episode :కార్తీక దీపం తాజా ఎపిసోడ్‌లో దాసుని బయటకి వెళ్లమని చెబుతాడు శివన్నారాయణ.అప్పుడు జ్యోత్స్న చూసి దాసుతో మాట్లాడుతుంటుంది. మా మమ్మీడాడీతో నీకేంటి పని. దీప తండ్రి డ్రాయింగ్ ఎందుకు ఉందంటే సమాధానం చెప్పవు, కుబేర్ వాళ్ల అక్క అనసూయను కలిసి డ్రాయింగ్ గురించి మాట్లాడుతున్నావ్. ఇప్పుడు మా ఇంటికి వచ్చావ్. ఏంటి నీ సమస్య అని దాసుని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. అయితే అప్పుడు నిజం చెప్పడానికి వచ్చానని దాస్ అంటారు. ఈ ఇంటి అసలైన వారసురాలు ఏవరో తెలిసింది అని అనడంతో దాస్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. చిన్నప్పుడు కార్తీక్‍ను కాపాడింది దీపే. కానీ ఆ విషయం కార్తీక్‍కు తెలియదు. ఎవరో అనుకుంటాడు. అందుకే ఎక్కడున్నావంటూ ఆలోచిస్తుంటాడు.
ఇంతలోనే దీప వస్తే ఆ చైన్ దాచేస్తాడు. చేతిలో ఏంటది అన్నా కూడా చూపించడు. ఎవరినైనా కలవాలనుకుంటే త్వరగా కలవాలని, ఆ తర్వాత అవకాశం రాకపోవచ్చని దీప చెబుతుంది. ఆ మనిషి ఎక్కడుందో తెలిస్తేనే కదా దీప అని కార్తీక్ అనుకుంటాడు. ఇక వారసురాలు ఎవరు అని దాసును గట్టిగా అడుగుతుంది జ్యోత్స్న. తాను చెెప్పనని, తన అన్నావదినలు దశరథ్, సుమిత్రకే చెబుతానని అంటాడు. నిజం తెలిస్తే ధైర్యంగా చెప్పు, నీకు తెలియదు కదా, షాడిస్ట్ అంటూ రెచ్చగొడుతుంది జ్యోత్స్న. అసలైన వారసురాలు ఎప్పుడో చచ్చిపోయిందని అంటుంది. కాసేపటి వాదన తర్వాత దాసు అసలు నిజం చెప్పేస్తాడు.
దీపే ఈ ఇంటి అసలైన వారసురాలు అని జ్యోత్స్నకు నిజం చెప్పుకొస్తాడు దాసు. కుబేర్ కూతురు దీప. శివన్నరాయణ మనవరాలు. సుమిత్ర, దశరథ్‍ల కూతులు, వారి యావత్ ఆస్తులకు అసలైన వారసురాలు అని జ్యోత్స్నతో దాసు చెబుతాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అబద్ధం అని జ్యోత్స్న అంటే.. ఇదే నిజం అని వివరాలు చెబుతాడు దాసు.దీప.. కుబేర్ సొంత కూతురు కాదని, అతడికి బస్టాండ్‍లో దొరికిందని ఆ విషయం తాను చూశానని దాసు చెబుతాడు. చిన్నప్పుడు దీపను చంపేయాలని సైదులుకు తన తల్లి పారిజాతం చెప్పిందని దాసు అంటాడు. అందుకు మనసు రాక సైదులు.. దీపను బస్టాండ్‍లో వదిలి వెళితే.. కుబేర్ తీసుకెళ్లడం తాను కళ్లారా చూశానని అంటాడు. దీప..
దీపను సైదులు చంపేశాడనుకొని.. అతడిని తన తల్లి పారిజాతం హత్య చేయించిందని గుర్తు చేసుకుంటాడు. కూతురిగా పేదింట్లో పెరగాల్సిన నువ్వు.. ఆ ఇంటికి చేరి సుమిత్ర కూతురు అయ్యావ్ అని జ్యోత్స్నతో దాసు అంటాడు. దీపే ఆ ఇంటి వారసురాలు అని నిరూపించేందుకు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతాడు. నీ కూతురిని నా కొడుకు భార్య చేయాలని.. దశరథ్ అన్నయ్య దగ్గర కాంచన మాట తీసుకుంది. ఆ మాట ఎంత బలమైందంటే నీతో కార్తీక్‍కు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కార్తీక్‍తో దీప మెడలో దేవుడు తాళి కట్టించాడు” దాసు అంటాడు. దీంతో జ్యోత్స్న మైండ్‍బ్లాక్ అవుతుంది. నువ్వు అసలైన వారసురాలు కాదని తెలిస్తే శివన్నారాయణ నిన్ను మెడపట్టుకొని బయటికి గెెంటేస్తారని అంటాడు. దాసు కూతురివి కాబట్టి బయటికి పంపేస్తారు అని అంటాడు.
నేను నీ కన్న కూతురిని.. నిజం తెలిస్తే నాకు అన్యాయం జరుగుతుందంటూ దాసుతో సెంటిమెంట్ డ్రామా మొదలుపెడుతుంది జ్యోత్స్న. దీప వారసురాలని దశరథ్‍కు చెప్పేస్తానంటాడు. కార్తీక్‍ను పెళ్లి చేసుకొని దీపకు న్యాయం జరిగిందని జ్యోత్స్న అంటుంది.తనను చంపాలంటూ గొంతుపై దాసు చేతులను పెట్టుకుంటుంది జ్యోత్స్న. నిజం చెబితే తాను కచ్చితంగా చస్తానంటుంది. అయినా సరే దాసు వినడు. మాటిస్తావా.. చావమంటావా అని జ్యోత్స్న అడుగుతుంది. దీంతో దాసు వెనక్కి తగ్గుతాడు.