Karthika Deeapam Today November 30 Episode : కార్తీక దీపం2 తాజా ఎపిసోడ్‌లో దీపని ఎందుకు అంత ఇష్టపడుతున్నావు అని కార్తీక్‌ని జ్యోత్స్న “నా కంటే అందంగా ఉంటుందా.. నాకంటే స్టైల్‍గా ఉంటుందా.. నా కంటే ఎక్కువ చదువుకుందా.. నా కంటే ఎక్కువ ఆస్తి ఉందా. నా కంటే దీప ఎందులో ఎక్కువో చెప్పు బావా” అని కార్తీక్‌ని విసిగిస్తుంది జ్యోత్స్న. అందమంటే బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం. అది దీపకు ఉంది. నీకు లేదు” అని కార్తీక్ అంటాడు. వెస్ట్రన్ వేర్ వేసుకున్నంత మాత్రానా స్టైల్ అయిపోదని , దీపకు ఉన్న జ్ఞానం నీకు లేదని చెబుతాడు. దీప గుణంలో కోటీశ్వరురాలు. అది నీకున్న ఆస్తిగా కంటే గొప్పది. మొత్తంగా చూస్తే దీపకు ఉన్న సహనం, ధైర్యం, ఔదార్యం, నిజాయితీ, నిస్వార్థం, మంచితనం, సహనం, ప్రేమ, సంస్కారం, గౌరవం ఇవి ఏవీ నీలో లేవు అని జ్యోత్స్నకి చెప్పుకొస్తాడు.
అయితే నీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, ప్రాణాలైనా ఇస్తానని జ్యోత్స్న అంటుంది. చిన్నతనంలో కలువ పువ్వు కావాలనే అడిగితే తాను కోనేట్లో దిగానని, మునిగిపోతే నువ్వు పారిపోయావని కార్తీక్ గుర్తు చేస్తాడు. అది చిన్నప్పుడు అని జ్యోత్స్న అంటే.. అదే వయసు ఉన్న వేరే అమ్మాయి తనను కాపాడిందని అంటాడు. ఆసుపత్రిలో రక్తం కావాల్సినప్పుడు నువ్వు కాదు.. దీప ఇచ్చింది. ఇది ఇప్పుడు ఈ దీప కాపాడిన ప్రాణం.. అందుకే అది దీపకే సొంతమైంది. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడు బాగా తెలుసు. నీకు ఏదైనా దక్కలేదంటే అది నీకు రాసిపెట్టిలేదని అర్థం. ఇలా కార్తీక్ మాటలకి జ్యోత్స్న మరింత రగిలిపోతుంది. రాసిపెట్టులేదన్నావ్ కదా.. నా రాత నేనే రాసుకుంటానని అనుకుంటుంది. ఇక దీప బస్టాండ్‍లో దొరికిందని దాసుకు చెప్పిన విషయాన్ని కుబేర్ ఫొటో చూస్తూ గుర్తు చేసుకుంటుంది అనసూయ.
మాట తప్పినందుకు క్షమించాలని ఫొటో చూస్తూ అంటుంది. నీ సొంత కూతురు కాదనే నిజం దీపకు తెలియకూడదు అని అనసూయ ఫొటో చూస్తూ అంటుంది. తెలిస్తే అంటూ సడెన్‍గా అంటాడు కార్తీక్. దీంతో కార్తీక్ బాబు వినేశారా అని కంగారు పడుతుంది అనసూయ. ఇక కుబేర్ గురించి నువ్వో, దీపో చెబితేనే విషయాలు తెలిసేదని కాంచన అంటుంది. దీంతో నాకు కుబేర్ ముందే తెలుసని కార్తీక్ చెబుతాడు. సమయం వచ్చినప్పుడు చెబుతాదమని అనుకున్నానని, చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయని అంటాడు. “దీప వాళ్ల నాన్న చనిపోవడానికి కారణం నేనే” అని చెబుతాడు. దీంతో కాంచన షాకై కారణం నువ్వేంటి అని అడుగుతుంది. తాను లండన్‍కు వెళ్లే ముందే స్నేహితులతో వెళుతుండగా.. తాము ప్రయాణిస్తున్న కారుకు ఢీకొట్టి కుబేర్ చనిపోయారని గుర్తు చేసుకుంటూ వారికి చెబుతాడు కార్తీక్.
ఎమోషన్‍లో మరోసారి అనసూయ మాట జారుతుంది. దీప అసలైన అమ్మానాన్న బతికే ఉంటే అని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీపకు కుబేర్ తండ్రి కాదా అని కాంచన ప్రశ్నిస్తుంది. దీంతో అసలైన అమ్మానాన్న ఎక్కడో ఉంటారనే ఉద్దేశంతో నోరు జారానని మనసులో అనుకుంటుంది అనసూయ. జ్యోత్స్న కోపంగా ఇంటికి రావడంతో ఏమైందని పారిజాతం అడుగుతుంది. కార్తీక్ అన్న మాటలన్నీ జ్యోత్స్న చెబుతుంది. కోపంతో రగిలిపోతుంది. దీపను పొడిగిన విషయాన్ని, రాసిపెట్టి లేనందుకు తనతో పెళ్లి జరిగిందని అనడతంతో కాలిందని అంటుంది. ఏదో ఒకటి చేయాలని గ్రానీ అని దీప అంటుంది.
వారసురాలు దీపే అని అనసూయ ద్వారా తెలుసుకున్న దాసు.. శివన్నారాయణ ఇంటికి వెళతాడు. అమ్మా అని పారిజాతాన్ని పిలుస్తాడు. దీంతో దాసు నువ్వేంటి ఇలా వచ్చావని పారిజాతం అంటుంది. వచ్చింది నీ కోసం కాదమ్మా అని దాసు అంటుంటేనే.. మరి ఎవరి కోసం అంటూ శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. దశరథ్ అన్న, సుమిత్ర వదిన కోసం వచ్చానని, పిలిస్తే మాట్లాడి వెళ్లిపోతానని దాసు చెబుతాడు. వాళ్లతో వీడికేంటి పని అని మనసులో అనుకుంటుంది పారిజాతం. మమ్మీడాడీని అతడు కలవాల్సిన పనేంటి అని జ్యోత్స్న కూడా అనుకుంటుంది. ఇక వెళ్లిపోవాలని దాసుతో శివన్నారాయణ అంటాడు. మళ్లీ వస్తానంటే వద్దు అని గట్టిగా అరుస్తాడు. దీంతో అక్కడి నుంచి దాసు వెళ్లిపోతాడు.