Karthika Deepam November 16th Episode : కార్తీక దీపం తాజా ఎపిసోడ్లో దీపతో జ్యోత్స ఒక డీల్ చేసుకుంటుంది. నీకు ఎంత కావాలో చెప్పు దీప ఇప్పుడే బ్యాంకుకు వెళదాం పద అంటుంది జ్యోత్స్న. ఇదివరకు ఎప్పుడూ నేను తాళిని అమ్ముకోలేదు దానికి విలువ ఎంత కడతారో నాకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్లి మీ నానమ్మని అడుగు. అప్పుడు నేను కూడా చెప్తానని దీప అంటుంది. జ్యోత్స్న కోపంగా దీప అంటే చెప్పు తీసుకుని కొడతాను ఇంకోమాట నోట్లో నుంచి బయటకు వచ్చిందంటే అని అంటుంది. తాళి బొట్టు అంటే ఏమనుకుంటున్నావ్. ఐదోతనం అంటే బంగారం కొట్టులో తాళి కొనడం అనుకుంటున్నావా? లాగిపెట్టి కొడితే ఒకవైపు బుర్ర పని చేయదు. మీ నానమ్మ, అమ్మ తాళికి ఎలాంటి విలువ ఇస్తారో నేను అలాంటి విలువ ఇస్తాను. నా కూతురికి నువ్వు తల్లివి అవుతావా?
ముందు నీ అమ్మకి కూతురిలా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత చెక్ ని జోష్న చేతిలో పెడుతుంది దీప. నీ కూతురికి తండ్రులు మారావు తల్లులు కూడా మారాలి అన్నావ్ కదా తండ్రులు మారలేదు నా కూతురికి కార్తీక్ బాబే తండ్రి అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ బాబు తండ్రిగా మారకముందు దానికి అన్నీ నేనే,అప్పుడు కూడా అది ఎవరిని నాన్న అని పిలవలేదు. అది నాన్న అని పిలిచిన మొదటి వ్యక్తి కార్తీక్ బాబునే అని అంటుంది .నేను బతికున్నంత వరకు దానికి మరొక అమ్మ అవసరం లేదు. ఇలాంటి పిల్ల వేషాలు వేయకు. మరోసారి ఇలా ఫోన్ చేసి రమ్మని మాట్లాడితే ఇంటికి కాదు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తానంటూ ఓ రేంజ్ వార్నింగ్ ఇస్తుంది.
ఇక శ్రీధర్ పారిజాతం చేసిన అవమానం తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. కావేరి వచ్చి చురకలు వేస్తుంది. ఇద్దరి మధ్య కాసేపు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది. అయితే అదే సమయంలో కాశీ కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దాసు వచ్చి ఏం జరిగిందని అనడగా, పారిజాతం నానమ్మ అంటే చిరాకు ఉండేది కానీ ఇప్పుడు జ్యోత్స్న అక్క అంటే కూడా చిరాకు వచ్చింది. తప్పు నాదే రిసెప్షన్ చేయకుండా ఉండాల్సిందని అంటాడు. కావేరి వచ్చి జరిగిన విషయాలు తలుచుకొని ఎంతసేపు బాధపడుతూ ఉంటారు అంటుంది. అప్పుడు ఇద్దరూ ఫన్నీగా ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు నిన్ను అనుమానిస్తే మధ్యలో నేనేం చేశాను నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నారు అని అంటుంది కావేరి. వరకు వైపు కాశి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
జ్యోత్స్న నీకు అక్క, దీప పరాయిది అని దాసు నోరు జారతాడు. దీపక్క చాలా మంచిదని కాశీ అంటాడు. జ్యోత్స్న దీపక్క జోలికి రాకుండా ఉండాలంటే తనకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని స్వప్న కూడా అంటుంది. శివనారాయణ దశరథ జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న విషయంలో విశ్వనాథంతో మాట్లాడతానని అంటాడు. అప్పుడే విశ్వనాథం శివనారాయణకు ఫోన్ చేస్తాడు. ఈరోజు పేపర్ చూశావా? జ్యోత్స్న రెస్టారెంట్ ఓనర్ కార్తీక్ అంటే నీ మనవడే కదా. ఆ అబ్బాయే కదా నీ మనవరాలిని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నువ్వు నిజాలు దాచావు.నీ మనవడు పెళ్లి చేసుకుంది దీపను కదా. ఆమెకిది రెండో పెళ్లి పైగా కూతురు కూడా ఉందట కదా. అల్లుడు విషయం అంటే చూసి చూడనట్టు వదిలేశాను కానీ నీ మనవడికి నీ ఇంటితో బంధుత్వం ఉంది. చూసి చూసి నీ ఇంటికి నా మనవడిని ఎలా అల్లుడిని చేయమంటావ్.సారీ శివనారాయణ ఏమి అనుకోకు.. నీ మనవరాలికి వేరే ఏదైనా సంబంధం చూసుకోమని చెప్పేస్తాడు.