Karthika deepam november 18th episode : కార్తీక దీపం తాజా ఎపిసోడ్‌లో శివన్నారాయణ న్యూస్ పేపర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆ పేపర్ ని చూసి సుమిత్ర దంపతులు కూడా షాక్‌లో ఉండిపోతారు. కార్తీక్ గాడు వాడి ఫొటోలు పేపర్‌లో వేయించాడు అని అనగా, స్వప్న అక్కడికి వచ్చి ఆ మాటలతో షాక్‌లో ఉండిపోతుంది. అదే సమయంలో అందరి పేర్లు వేయించాడని శివన్నారాయణ అగ్గిమీద గుగ్గిలం అవుతూ ఉంటాడు. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో అని ఎందుకు రాయాలి. పరువే ముఖ్యంగా బతికే నాకు మీ ఇంటి నుంచి సంబంధం తెచ్చుకోలేను మీ మనవరాలికి వేరే సంబంధం చూసుకోమని తన ఫ్రెండ్ చెప్పాడని రగిలిపోతాడు శివన్నారాయణ.పేపర్లో ఫోటో చూసి పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు షాక్ అవుతారు. తాతయ్య వెళ్లి బావని కలవక ముందే నేనే వెళ్లి బావని కలవాలి అనడంతో నేను వస్తాను అనగా వద్దు అని జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు దీప వంట చేసుకుంటూ ఉండగా కార్తీక్ పేపర్లో ఫోటో చూపించడానికి దీపా దగ్గరికి వెళ్తాడు. పేపర్ లో వేయించిన ఫోటో తల్లికి చూపించాలని అనుకుంటే కాంచన కూడా ఇంట్రెస్ట్ చూపించదు. అదే సమయంలో స్వప్న, కాశీ ఇంటికి రావడంతో మార్నింగ్ భలే సర్ ప్రైజ్ ఇచ్చావని స్వప్న అన్నని మెచ్చుకుంటుంది. కాసేపు కాశీ వాళ్ళు హడావుడి చేసి పేపర్ లో కార్తీక్ వేయించిన ఫోటో చూపిస్తాడు. అది చూసి కాంచన వాళ్ళు సంతోషపడతారు. దీప మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఈపాటికి మా నానమ్మ ఫోటో చూపించి గుండె పట్టుకుని ఉంటుందని కాశీ కౌంటర్ వేయడం జరుగుతుంది. పేపర్ లో ఎందుకు వేయించారని అంటే పెళ్లి గురించి అందరికీ తెలియాలి కదా అందుకే వేయించానని చెప్తాడు.
పేపర్లో ఫోటో చూసి కాంచన, అనసూయ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మంచి పని చేశావు కార్తీక్ అంటూ అందరూ ఇంట్లో కార్తీక్ ని మెచ్చుకుంటూ సంతోషపడుతూ ఉండగా దీప మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు వేయించారు బాబు అని కార్తీక్ ని అడుగుతుంది దీప. మళ్లీ దీనివల్ల ఏమైనా గొడవ జరిగితే అని అంటుంది దీప.జరిగింది మంచి పని అయినప్పుడు పది మందితో పంచుకోవడంలో తప్పు లేదని స్వప్న అంటుంది. ఫోటోను తన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తానని శౌర్య ముచ్చటపడుతుంది. కార్తీక్ రెస్టారెంట్ కు వెళ్తున్నానని అంటే శౌర్య తాను కూడా వస్తానని అంటుంది.
దీపను కూడా రమ్మని శౌర్య ఒత్తిడి చేస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఎక్కడికీ వెళ్లలేదు కదా వెళ్ళమని కాంచన కూడా చెప్తుంది. అక్కడకి వెళ్తే జ్యోత్స్న ఎక్కడ గొడవ చేస్తుందోనని దీప భయపడడం మనం చూస్తాం. కానీ శౌర్యతో పాటు అందరూ బలవంతం చేయడంతో ఒప్పుకుంటుంది. దీపను తీసుకుని కార్తీక్ రెస్టారెంట్ కు వస్తాడు. దీప స్పెషల్ వంటకాలు అందరికీ రుచి చూపించాలని అనుకుంటాడు. రెస్టారెంట్ లో మెన్యూ కింద దీప వంటకం ఉప్మా బిర్యానీ పెట్టించడం జరుగుతుంది. రెస్టారెంట్ కు వచ్చిన వాళ్ళు ఉప్మా బిర్యానీ ఆర్డర్ పెడతారు. దీంతో దీపను తీసుకుని కిచెన్ లోకి వెళతాడు.కాస్త టెన్షన్ గా ఉంది వినడంతో ఏం భయపడకుండా తొందరగా ఆ ఆర్డర్ ని పూర్తి చేయాలి దీపా అని అంటాడు.