Karthika Deepam November 27th Episode :కార్తీక దీపం తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ పదవి దక్కించుకోవడం గురించి దీప ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో కాంచన వచ్చి దీపతో ‘నీ కన్నీళ్ళకు కారణం మా నాన్నే కదా ’ అని అడుగుతుంది. అప్పుడు దీపా ‘మీ మేనకోడలిని పెళ్లి చేసుకుని కంపెనీ యజమాని అవ్వాల్సిన మనిషి … నన్ను పెళ్లి చేసుకొని ఉన్న స్థానం నుంచి కూడా దిగిపోయారు’ అని చాలా బాధగా చెబుతుంది. కార్తీక్ మంచితనం గురించి కాసేపు వర్ణిస్తుంది. తాను ఊహించిన దాని కంటే కార్తీక్ చాలా గొప్ప మనిషి అని చెబుతుంది. అప్పుడు కాంచన నీ భర్త మంచితనం కన్నా ఆ సీఈవో పోస్టు పెద్దదా? అని అడుగుతుంది. దానికి దీప కాదని సమాధానం చెబుతుంది. అప్పుడు శౌర్యని అనసూయ తీసుకురాగా, అప్పుడు కార్తీక్ అని పిలుస్తుంది శౌర్య.
అప్పుడు దీప..శౌర్యని బెడ్ రూంకి తీసుకెళ్లి చిన్నపాటి క్లాస్ పీకుతుంది. కార్తీక్ అని పిలవొద్దని దీప అంటే శౌర్య ఏమని పిలవాలో చెప్పమని అడుగుతుంది.. ఇకపై కార్తీక్ ని నాన్న అని పిలవమని చెబుతుంది దీపా. అది విని అనసూయ, కాంచన ఎంతో ఆనందపడతారు. జ్యోత్స్నా సీఈవో పదవిని సరిగా నిర్వహించగలదో లేదో అని అనుమానం పడుతుంది సుమిత్ర. అదే సమయంలో శివన్నారాయణ అక్కడికి వచ్చి తన మనవరాలు చక్కగా పదవిని చేస్తుందని, తనకు ఆ నమ్మకం ఉందని చెబుతాడు. సుమిత్ర కార్తీక్ లండన్ నుంచి రావడానికి ముందు మన బిజినెస్ తక్కువగా ఉండేదని కార్తీక్ బాధ్యతలు తీసుకున్నకే లాభాలు వచ్చాయని అంటుంది. దానికి శివన్నారాయణ వ్యాపారంలో లాభాలు వచ్చినా, వ్యక్తిగతంగా నష్టాలు వచ్చాయని చెబుతాడు.
ఎవరైనా సరే జోత్స్న చెప్పిన మాట వినాల్సిందేనని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలు సుమిత్రకు ఏమాత్రం నచ్చవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే కార్తీక్ ఎంత బాధ పడతాడో తనకు తెలుసని సుమిత్ర ఎంతో వేదన పడుతుంది. దీప పనిచేస్తుండగా కార్తీక్ ఇంట్లోకి వస్తాడు. శౌర్యకి ఐస్ క్రీమ్ కొనిస్తాడు. దీప కోసం మల్లెపూలు కొని ఇంటికి తెస్తాడు. ఆ మల్లెపూలను చూసి దీప ఎంతో ఆనందపడుతుంది. వెంటనే కార్తీక్ ‘ అమ్మ మల్లెపూలు కొని తెచ్చి నీకు ఇవ్వమంది’ అని చెబుతాడు. దానికి దీప ‘నా కోసమా’ అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ ‘దేవుడు కోసం అమ్మ తెమ్మంది’ అని చెబుతాడు. ఆ తర్వాత ‘నువ్వు కూడా పెట్టుకోవచ్చు. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మల్లెపూలని మంచం మీద చల్లుకొని పడుకునే వాడిని’ అంటాడు. తర్వాత మల్లెపూలను దీప చేతికి ఇచ్చేస్తాడు.
జ్యోత్స్నా ..దీప తనను కొట్టిన చెంప దెబ్బను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పగతో రగిలిపోతూ దీప పోస్టు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఒక రౌడీ కి ఫోన్ చేస్తుంది. అతడి పేరు లారెన్స్. ఒక ఆడ మనిషిని చంపాలని దానికి ఎంత తీసుకుంటావని అడుగుతుంది. లారెన్స్ నేరుగా వచ్చి మాట్లాడమని చెబుతాడు. ఇక శౌర్య కంట్లో నలత పడిందని చెబుతూ ఏడుస్తుంది. దీపా, కార్తీక్ కలిసి ఆ నలతను తొలగిస్తారు. ఆ సమయంలో కార్తీక్ దీప చీర కొంగును తీసుకొని శౌర్య కంట్లోని నలతను తీస్తాడు.దీప చీర కొంగు కార్తీక్ చేతిలో ఉండడంతో… దీప అలా నిలుచుండి పోతుంది. ఆ సమయంలో పిల్లల కోసం పెద్దవాళ్లు కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెబుతాడు కార్తీక్.