Karthika Deepam Serial Today November 28th Episode : కార్తీక దీపం తాజా ఎపిసోడ్‌లో కార్తీక్.. దీప కొంగు చీర పట్టుకుంటాడు. ఆ సమయంలో దీప చాలా ఆనందంగా ఫీలవుతుంది. ఆ సమయంలో కార్తీక్.. దీపతో మనం నలుగురు మధ్యలోనే భార్యభర్తలం. మన కూతురు కోసం అయినా మనం కలిసినట్టు నటించాలి. కొన్ని కొన్ని సార్లు నీకు ఇష్టం లేకపోయినా, నేను చొరవ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతక ముందు చీర కొంగు తీసుకోవడం రిసెప్షన్ లో నీ మీద చేయి వేయడం ఇలాంటివి,కాబట్టి అర్థం చేసుకుంటున్నావని ఆశిస్తున్నాను అని దీపతో అంటాడు. అప్పుడు దీప.. మీరు ఒక మనిషిని ఇంత బాగా అర్ధం చేసుకుంటారు అని అంటుంది. మరోవైపు దీపని చంపించేందుకు రౌడీల కోసం ప్రయత్నం చేస్తుంటుంది జ్యోత్స్న. ఇంతలో దాసు కుబేరుడు కోసం వెతుక్కుంటూ అటువైపు రాగా జోష్నని చూసి షాక్ అవుతాడు.
జ్యోత్స్న ఇక్కడ ఉందేంటనే ఆలోచనలో పడతాడు. అప్పుడు రౌడీ.. జ్యోత్స్నతో మాట్లాడడం, అక్కడి నుండి తీసుకొని వెళుతుండగా, అనుమానం వచ్చిన దాసు వారినే ఫాలో అవుతుంటాడు. మరొకవైపు కార్తీక్ శౌర్య ఆరోగ్యం గురించి డాక్టర్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చి ఆ మాటలు వింటుంది దీప. నా మాటలు అన్ని దీపా వినేసిందా అని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరితో బాబు శౌర్యకి ఆ మందులు కంటిన్యూ చేయాలా వద్దా అని అడుగుతున్నారు అనడంతో డాక్టర్ తో అని అంటాడు. అప్పుడు ఎలా అయినా దీపకు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటాడు. అప్పుడు దీప పదేపదే గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో కార్తీక్ అబద్ధాలు చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు. అయితే ఎవరితో కార్తీక్ మాట్లాడాడో తెలుసుకోవాలని ఫోన్ నెంబర్ సెర్స్ చేస్తుంటుంది.
అప్పుడు కార్తీక్ వచ్చి ఎవరికైనా ఫోన్ చేయాలా దీప అనడంతో అవును బాబు ఇందాక మీరు మాట్లాడారు కదా ఆ డాక్టర్ కి ఫోన్ చేయండి అని అంటుంది. దాంతో నా మీద నీకు నమ్మకం లేదా దీప అందుకే ఇలా అడుగుతున్నావా అని అంటాడు. మరొకవైపు దాసు జ్యోత్స్నని ఫాలో అవుతుంటాడు. ఆ తర్వాత దాసు.. జ్యోత్స్న చెయ్యి పట్టుకుని పక్కకు పిలుచుకొని వెళ్తాడు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావ్ ఇది చాలా డేంజర్ ఏరియా అనడంతో అది అడగడానికి నువ్వు ఎవరు అనగా నేను నీ కన్న తండ్రిని అనగా కాదు నా కన్న తండ్రి దశరథ సుమిత్రలే అని అంటుంది జ్యోత్స్న. సరే నువ్వు మా అన్నయ్య కూతురివే కానీ ఇక్కడ నుంచి వెళ్లిపో అనగా నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అంటుంది.
మరొకవైపు దీప తండ్రి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న చెయ్యి పట్టుకొని దాసుని పక్కకు నెట్టేస్తుంది .అప్పుడు అందులో నుంచి తండ్రి ఫోటో గీయించిన పేపర్ బయటపడుతుంది. మరొకవైపు దీపా చేతిలో నుంచి తండ్రి ఫోటో చేయి జారిపోవడంతో దీప భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అనసూయ అక్కడికి వచ్చి అసలు నీ తండ్రి ఆయన కాదే వేరే ఉన్నారు అది నీకు ఎలా చెప్పాలో తెలియదు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దీప తండ్రి ఫోటో ని చూసి ఇతనీ ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది అని అంటుంది జ్యోత్స్న. ఇతను నీకు తెలుసా అని దాసు అడగడంతో తెలుసు అని అంటుంది జ్యో. ఇతను ఎవరో కాదు ఆ దీప తండ్రి అనడంతో దాసు ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు దాసు. అంటే అసలు వారసురాలు దీపేనా ఎన్ని రోజులు వారసురాలని ఎదురుగా పెట్టుకుని వెతుకుతున్నానా అని అనుకుంటూ ఉంటాడు. అనసూయని అడిగితే ఈ విషయంపై మరింత క్లారిటీ వస్తుందని అనుకుంటాడు.