Karthika Deepam Serial Today November 29th Episode : కార్తీక దీపం2 తాజా ఎపిసోడ్‌లో కార్తీక్ షర్ట్ బటన్ ఊడిపోయి ఉంటుంది. అప్పుడు బటన్ కుట్టడానికి కార్తీక్ తన అమ్మని పిలుస్తాడు. అప్పుడు అనసూయ, కాంచన, శౌర్యలు మాత్రం దీపను బటన్ కుట్టడానికి పంపించాలి అని ఫిక్స్ అయ్యి విననట్టు వెళ్లిపోతుంటారు. అప్పుడు బటన్ కుట్టడానికి దీప రాగా, ఆమెని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఇక దీప బటన్ కుట్టగా, కార్తీక్ చాలా సంతోషం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు దీపకు థాంక్స్ చెప్పగా, నేను మీకు ఎన్ని థాంక్స్ లు చెప్పాలో అని అంటుంది. మీరు నా మంచి గురించి ఎలా ఆలోచిస్తారో నేను కూడా మీ గురించి అలానే ఆలోచిస్తాను అని అంటుంది.. మీది నాది పవిత్రమైన బంధం అని దీప అంటే అవును అని అంటాడు.
అనంతరం అనసూయ కుబేరు ఫొటో ఫ్రేమ్ పాడైందని, దానికి టేప్ వేయాలని అనుకొని దానిని బయటకు తీసుకొస్తుంది. అప్పుడు దాసు ఇంట్లోకి వస్తాడు. దీపను ఆమెకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు.. లేదు నేను ఒక్కటే అని చెప్తాడు.. ఆతర్వాత తల్లితండ్రుల పేర్లు కనుక్కొని కుబేరు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు… అప్పుడే అనసూయ చేతిలో ఉన్న ఫోటోను చూసి దీపే వారసురాలు అని అనుమానంతో మళ్లీ నిజాలు తెలుసుకోవాలి అనుకుంటాడు.. కాని దీపను అడగకూడదు అనసూయను అడగాలి అని భావిస్తాడు. ఈ క్రమంలో తన సంచిని పక్కన పెట్టి అననసూయని బయటకి రప్పించేలా చేస్తాడు.
ఇక బయటకి వచ్చిన అనసూయకి కుబేరు ఫొటో కనిపించేలా చేస్తాడు దాసు. అప్పుడు నా తమ్ముడు నీకు తెలుసా? అని అడిగితే తెలుసు అమ్మ.. కుబేరుకు కొన్నేళ్ల క్రితం ఒక పాప దొరికింది అనగానే ఆ పాప దీపే అని మీకు తెలుసా అని అడుగుతుంది.. దాంతో దాసు సంతోషపడుతాడు.. దీప గురించి మీరే నాకు చెప్పారు అమ్మ అని అంటాడు. దాంతో కుబేరుకు ఇచ్చిన మాట గుర్తొచ్చిన అనసూయ దీపకు మాత్రం ఈ నిజం చెప్పకండి అని అడిగితే మీరు దాచమని చెప్పినంత మాత్రం దాచలేం అమ్మ అని అంటాడు.. అప్పుడే అక్కడకు వచ్చిన జ్యోత్స్న అసలు ఆ ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? అసలు అనసూయను దాసును ఏం అడుగుతున్నాడు? అని ఆలోచిస్తుంది..
అప్పుడు దాసు అనసూయకు కొన్ని విషయాలు చెప్పి చెప్పనట్టు నిజాలు చెప్పి పోతాడు. అప్పుడు అక్కడకు వచ్చిన జ్యోత్స్న కార్తీక్ ముందుకు వెళ్లి రచ్చ రచ్చ చేస్తుంది.. కార్తీక్ ను తనని రెండో పెళ్లి చేసుకోమని మారాం చేస్తుంది. ఆమె చేష్టలకు కార్తీక్ చాలా చిరాకుపడతాడు..ఇక ఆ వేధింపులు తట్టుకోలేక జ్యోత్స్నకు అసలు నిజం చెప్తాడు.. నేను శౌర్య కోసం దీపను పెళ్లి చేసుకోలేదు.. దీపపై ఉన్న ప్రేమతోనే దీపను పెళ్లి చేసుకున్న అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న ముఖం వాడిపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది మరుసటి ఎపిసోడ్‌లో తెలియనుంది.