Karthika Deepam Today Episode December 3 : కార్తీక దీపం తాజా ఎపిసోడ్‌లో దీపకు అన్యాయం చేయనని దాసు అంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు జ్యోత్స్న తన మనసులో “నేనోదే నాన్న అని పిలిచి.. అమ్మను గుర్తు చేసి.. ఎమోషనల్‍గా లాక్ చేద్దామనుకుంటే సగం అర్థమై.. అర్థం కానట్టు చెప్పి వెళ్లాడు. నీ నీటితో చెప్పవు కానీ.. అన్యాయం చేయవా. అంటే న్యాయం చేస్తావ్. చెయ్ నాన్న. అయినా నువ్వు నా నాన్న ఏంటి.. గ్రానీకి కొడుకువు అంతే” అని అనుకుంటుంది. దీపని చంపేస్తానని జ్యోత్స్న అనుకొని.. న్యాయం చేయాలంటే దీప బతికి ఉండాలి కదా అని మాట్లాడుకుంటుంది. ఇక ఈరోజు స్కూల్‍కు వెళ్లనని దీప వద్ద శౌర్య మారాం చేస్తుంది. నాన్న, నువ్వు, నేను ఎక్కడికైనా బయటికి వెళదామంటుంది. అంతలోనే కార్తీక్ వస్తాడు. స్కూల్‍కు వెళ్లనని, సినిమాకు వెళదామని శౌర్య అంటే కోప్పడతాడు.
బుద్ధి ఉందా నీకు.. బెత్తం వాడతానంటాడు. దీంతో నువ్వేనా ఇలా అంటోందని అని శౌర్య ఆశ్చర్యపోతుంది. దీప కూడా అలాగే ఫీల్ అవుతుంది.ఇంతలోనే డాక్టర్ దగ్గరి నుంచి కార్తీక్‍కు ఫోన్ వస్తుంది. శౌర్య ఆరోగ్యం గురించి రిపోర్ట్ వచ్చిందని చెబుతాడు. ఇంతలోనే కార్తీక్ మాట మార్చేస్తాడు.తాను, శౌర్య ఆసుపత్రికి సరదాగా వెళతామని అంటాడు. దీంతో ఎందుకు అని దీప అడిగితే.. తనకు తలనొప్పి అని అందుకే వెళతామని చెబుతాడు. శౌర్య గురించి కార్తీక్ ఏదో నిజం దాస్తున్నారని మనసులో అనుమానిస్తుంది దీప. ఇక దీపనే శివన్నారాయణ మనవరాలు అని, అసలైన వారసురాలు అని దాసు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని జ్యోత్స్న దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది.
ఒకడు లాగిపెట్టి కొడితే బాధ పడాలా.. పొడిచినందుకు బాధపడాలా అంటూ.. లాజిక్ మాట్లాడుతుంది జ్యోత్స్న. కత్తితో పొడిచింది ఎవరు అని పారిజాతం అడిగితే నీ కొడుకు అంటుంది. అయితే, దీపే వారసురాలు అని దాసు చెప్పిన నిజాన్ని పారిజాతానికి చెప్పకుండా జ్యోత్స్న దాచేస్తుంది. నువ్వు ఆరోజు ఆ బిడ్డను లేకుండా చేసి ఉంటే బాగుండేదని జ్యోత్స్న అంటే.. ఇప్పుడు దాని గురించి ఎందుకే అని కంగారు పడుతుంది పారిజాతం. “ఆ బిడ్డ తిరిగి వస్తే. అసలైన వారసురాలు తిరిగి వస్తే ఏం చేస్తావ్” అని జ్యోత్స్న అంటుంది. నోరు మూస్తావా.. అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దని, అలాంటివి మనసులో కూడా అనుకోవద్దని పారిజాతం వారిస్తుంది.
కార్తీక్ వద్దన్నా.. ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది దీప. ఎలాగైనా శౌర్య గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. దీప వచ్చేలోగా వెళ్లాలని కార్తీక్ అనుకుంటాడు. అయితే, వెనుక సీట్లో కూర్చున్న దీపను చూసి షాక్ అవుతాడు. నువ్వేందుకు అని దీప అడిగితే.. మీ కోసం వస్తున్నానంటుంది. శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి దీపకు నిజం తెలియకుండా ఆసుపత్రిలోనే ఏదో మ్యానేజ్ చేయాలని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్, దీప, శౌర్య ఆసుపత్రిలోకి వెళుతుంటే కారులో నుంచే చూస్తుంది జ్యోత్స్న. “అసలైన వారసురాలు ఎక్కడో అనాథలా బతుకుతూ ఉంటుంది. నాకెందుకులే అనుకున్నా. కానీ నా ఇంటికి అనాథగా వచ్చిన దీపే కొంచెం కూడా అనుకోలేకపోయాను అని మనసులో జ్యోత్స్న అనుకుంటుంది. ఇక ఆసుపత్రి బయట దీప, శౌర్య కూర్చుంటే డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళతాడు. నాతో పాటు నా వైఫ్ కూడా వచ్చింది” అని కార్తీక్ అంటాడు.