Keerthy Suresh : మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న కీర్తి సురేష్ ఎట్టకేలకి తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పబోతుంది. గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేయగా, వాటిపై కీర్తి సురేష్ స్పందించింది లేదు. అయితే ఇప్పుడు ఈ భామ తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనితో కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.తన ప్రియుడును ఆంటోనిని సోషల్ మీడియా ద్వారా పరిచియం చేసింది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది.
ఇక కీర్తి సురేష్ తిరుమలలో తళుక్కున ప్రత్యక్షం అయింది. అంతేకాదు తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం ముందు కీర్తి సురేష్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగబోతున్నట్లు స్పష్టం చేసింది. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు కీర్తి సురేష్ చెప్పింది. తన కొత్త చిత్రం బేబీ జాన్ , వచ్చే నెలలో తన పెళ్లి ఉంది కాబట్టి దర్శనం కోసం వచ్చాను అని కీర్తి సురేష్ చెప్పింది. పెళ్లి ఎక్కడా అని అడిగితే.. గోవాలో అని సింపుల్‌గా సమాధానం చెప్పింది.
శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కీర్తి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్వామివారిని దర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 11, 12 తెదీల్లో గోవా (Goa)లో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందంట. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది