Pushpa 2 : రీసెంట్‌గా విడుదలైన పుష్ప2 చిత్రం పెద్ద హిట్ అయింది. అభిమానులు హ్యాపీ, అల్లు అర్జున్, నిర్మాతలు హ్యాపీ. కాని సినిమా చూడడానికి వచ్చి మృత్యువు బారిన పడింది రేవతి అనే అభిమాని. ఆమె కుటుంబం ఇప్పుడు తీరని దుఃఖంలో ఉంది. పుష్ప2 మూవీ చూసేందుకు దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7).. అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. అప్పటికే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండగా, వారు హల్ లోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ విపరీమైన జనాలు ఉన్నారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ కింద పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిటనట్లు తెలుస్తొంది.
దీంతో పోలీసులు బాలుడికి సీపీఆర్ చేసారు. రేవతి మాత్రం స్పందించలేదుది. వీరిని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు అక్కడ రేవతి చనిపోయినట్లు ప్రకటించారు. కానీ బాలుడ్ని మాత్రం మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. సంధ్య థియేటర్ ప్రీమియర్ షో సంఘటన నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బెనిఫిట్ షోలకు, మిడ్ నైట్ షోలకు, ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వబోమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. థియేటర్ల వద్ద తొక్కిసలాట జరగడంతో పాటు అర్ధరాత్రి, తెల్లవారుజామున పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం వల్ల పోలీసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సామాన్య జనాలు సైతం ఆ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటించారు.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్నారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్కొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ సినిమా హీరోకి , ప్రొడ్యూసర్స్‌కు చెప్తున్న.. వాళ్ళని ఆదుకోండి’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంక్రాంతికి రాబోతున్న మూడు పెద్ద సినిమాలకు ఈ ప్రభావం ఉంటుంది.