Malaika Arora :బాలీవుడ్ భామలకి బ్రేకప్స్ కొత్తేమి కాదు. కొన్నాళ్లు కలిగి తిరగడం, వీలుంటే పెళ్లి చేసుకోవడం లేదంటే కొన్నేళ్లు డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పడం కామన్. బాలీవుడ్ బ్యూటీ మలైకా మరోరా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనకంటే తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు అప్పట్లో జరిగింది. వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా నడిచింది. కాని ఏమైందో ఏమో కాని సడెన్‌గా విడిపోయారు.
అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత, ఒక ‘మిస్టరీ మ్యాన్’తో తెగ చక్కర్లు కొడుతోందీ అందాల తార. ఇటీవల ఇద్దరూ చేతులు పట్టుకుని రెస్టారెంట్ నుండి బయటికి వస్తూ కనిపించారు. ఆ తర్వాత మలైకా ఇటీవలే సింగర్ ఎ. పి. ధిల్లాన్ సంగీత కచేరికి హాజరైంది. ఈ కచేరీలో, మలైకా మళ్లీ అదే మిస్టరీ మ్యాన్ తో కనిపించింది. ఇంతకీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో తెలుసా.. అతని పేరు రాహుల్ విజయ్. ఈ కచేరీలో మలైకాను వేదికపైకి ఆహ్వానించారు. ఎ. పి. ధిల్లాన్ ఆమె కోసం ఒక ప్రత్యేక పాట పాడారు. అంతేకాదు మలైకా తన చిన్ననాటి క్రష్ అని అందరికీ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అక్కడితే ఆగలేదు. ప్రియుడు రాహుల్ విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది మలైకా.
మరి వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారా, లేకుంటే కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి విడిపోతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ తాను ఒంటరిగా ఉన్నానని వెల్లడించాడు. అయితే మలైకాకు అర్జున్ ఎందుకు దూరంగా ఉన్నాడో ఇంకా తెలియరాలేదు. మరోవైపు మలైకా తన ఇన్‌స్టా స్టోరీలో కొన్ని ఫన్నీ పోస్ట్‌లను షేర్ చేస్తోంది. అర్బాజ్ ఖాన్ విడాకుల తర్వాత 2018లో మలైకా అర్జున్‌తో డేటింగ్ ప్రారంభించింది. వీరిద్దరు తరచుగా కలిసి కనిపించేవారు. అయితే 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు బ్రేకప్ తర్వాత మలైకా కష్ట సమయంలో అండగా నిలిచాడు. సెప్టెంబర్‌లో మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో మలైకాను ఓదార్చడానికి అర్జున్ వచ్చాడు.