Mallika Sherawat : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల బ్రేకప్స్‌కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం. మొన్నటికి మొన్న రెహమాన్ తన 29ఏళ్ల వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టాడు. ఇక ధనుష్,ఐశ్వర్యల విడాకులకి కూడా కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ బ్రేకప్‌కి సంబంధించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రియుడు ‘క్రిలీ ఆక్సన్ ఫాన్స్ తో విడిపోయినట్లు ప్రచారాలు సాగాయి. ఈ నేపథ్యంలో మల్లికా షెరావత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “ఈ రోజుల్లో మనకు సెట్ అవుతాడని అనిపించే వ్యక్తి దొరకడం చాలా కష్టమైపోయింది. అతడితో బ్రేకప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నాకు పెళ్లిపై ఇప్పుడు ఆసక్తి లేదు. అలాగని వ్యతిరేకం కూడా కాదు. అది భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటుంది” అంటూ బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చింది మల్లికా షెరావత్.
ఇక ప్రియుడితో విడిపోవడానికి గల కారణాలు అయితే చెప్పలేదు. పెళ్లి గురించి మాట్లాడుతూ.. దానిపై తనకు ఆసక్తి లేదంది. అలా అని తాను పెళ్లికి వ్యతిరేకం కాదనడం చూస్తే ఈ అమ్మడు పెళ్లి చేసుకునేలా అయితే కనిపించడం లేదని అంటున్నారు. అయితే భవిష్యత్తులో తనకు కనెక్ట్ అయ్యే వ్యక్తి ఎదురైతే పెళ్లి గురించి ఆలోచిస్తానంటుంది మల్లికా. మర్డర్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో మల్లికా నటించింది. 1976 అక్టోబర్ 24న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు మల్లికా షెరావత్. ఇకపోతే ఈమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ పేరు మీద చాలామంది హీరోయిన్స్ ఉండడంతో గందరగోళాన్ని నివారించడానికి తన పేరును మల్లికా గా పెట్టుకుంది.
‘షెరావత్’ అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటిపేరు. తన తల్లి తనకు ఇచ్చిన మద్దతు కారణంగానే తన తల్లి పేరును ఉపయోగిస్తున్నానని కూడా ఆమె తెలిపింది. మధుర రోడ్డు లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఈమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, మిరాండా హౌస్ నుండి తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది.1997లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న సమయంలోనే, ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్ ను వివాహం చేసుకుంది. ఇక నాలుగేళ్ల తర్వాత సినిమా రంగంలోకి రావడం కోసం భర్తకి విడాకులు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈమె హాలీవుడ్ కి వెళ్లడానికి కూడా ప్రయత్నం చేస్తోంది.