Manoj : మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీ మీడియా, టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. ఉదయం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు రాగా, అందరు షాక్ అయ్యారు. మంచు మనోజ్ స్వయంగా గాయాలతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబు కూడా మనోజ్ తనపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సోషల్ మీడియా, మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే దీనిపై మంచు ఫ్యామిలీ స్పందించింది. అయితే మంచు ఫ్యామిలీ ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోజు భూమ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఈ గొడవలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ.. తమ కుటుంబం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అసత్య ప్రచారాలను ప్రచారం చేయొద్దన్నారు. తాజాగా మంచు మనోజ్ బంజారాహిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రులో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. మనోజ్ ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వెంట భార్య భూమా మౌనికతోపాటు మరికొంత మంది ఆసుపత్రికి వచ్చి మనోజ్ ను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. అయితే మోహన్‌బాబు అనుచరుడు మనోజ్ పై దాడిచేసినట్టు సమాచారం.
వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు విద్యా సంస్థలో కీలక పదవిలో ఉన్నాడని తెలుస్తోంది. నాన్న ప్రమేయంతోనే వినయ్ తనపై దాడి చేశారని మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించి మనోజ్ పహాడి షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జల్ పల్లి మోనహన్ బాబు నివాసం నుంచి డయల్ 100 కు ఫిర్యాదు వచ్చనట్లు పహడీ షరీఫ్ పోలీసులు సమాచారం అందించినట్టు సమాచారం. దీనిపై మోహన్ బాబు లేదా మనోజ్ కాని స్పందిస్తే అసలు విషయం ఏంటనేది అర్ధమవుతుంది.