Manchu Manoj-Mohan Babu : టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి కూడా గుర్తింపు ఉంది. ఒకప్పుడు మంచు మోహన్ బాబు కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఆయన వారసులుగా వచ్చిన మనోజ్, విష్ణు మాత్రం మోహన్ బాబు మాదిరిగా రాణించలేకపోయారు. వారిద్దరు సినిమాల కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. కొద్ది రోజులుగా మోహన్ బాబు, మనోజ్‌కి పడడం లేదనే టాక్ వినిపిస్తుంది. తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గతంలో కూడా మంచు మనోజ్ కి.. మంచు విష్ణుకి విభేదాలు తలెత్తాయి. కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ తలెత్తిందనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు వివాదం ఆస్తుల విషయంలో జరిగిందని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి విద్యాసంస్థలు ఉన్నాయి. ఆస్తులు, స్కూలు వ్యవహారంలో మంచు మనోజ్ తండ్రిని ఎదిరిస్తున్నాడని తెలుస్తోంది. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు ఘర్షణకి దిగినట్లు మీడియా కథనాల్ని బట్టి ప్రచారం జరుగుతోంది. ఘర్షణ తర్వాత మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు మనోజే తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. తన భార్యపై కూడా దాడి చేసినట్లు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మంచు ఫ్యామిలీ పీఆర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని మంచు ఫ్యామిలీ పిఆర్ టీమ్ ద్వారా స్పందించినట్లు తెలుస్తోంది. ఏ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాలేదని పిఆర్ చెబుతున్నారు. తన తండ్రి మోహన్ బాబు ఆయన అనుచరుల చేత దాడి చేయించినట్లు మంచు మనోజ్ పేర్కొన్నారట. ఈ ఆస్తుల విషయంలో గొడవ జరిగినట్లు కూడా మంచు మనోజ్ పేర్కొన్నారట. దీనిపై తప్పకుండా కేసు నమోదు చేస్తానని మంచు మనోజ్ చెబుతున్నారట. మోహన్ బాబుకి చెందిన కాలేజీ, యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి మంచు మనోజ్ ని కొట్టినట్లు తెలుస్తోంది.