Mohan Babu : కాగా మంచు వారి కుటుంబంలో నడుస్తున్న హై డ్రామా పట్ల ఒకింత ఊహించని పరిణామాలు వారి ఫ్యామిలీ మార్క్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా కనిపిస్తుంది. అయితే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అలాగే తన కొడుకులు ఇద్దరు మంచు విష్ణు అలాగే మంచు విష్ణు మనోజ్ కూడా పలు షాకింగ్ ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇక విష్ణు తన ఇంటి చుట్టూ 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ ముదిరింది. తాజాగా జలపల్లిలోని మంచు టౌన్‌కు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశారు. టీవీ 9 మైక్ లాక్కొని మీడియా పై దాడి చేశారు మోహన్ బాబు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తన కూతురిని ఇంట్లో పెట్టుకుని ఇవ్వడంలేదంటూ మనోజో ఆరోపణలు చేస్తున్నారుు. తమ బిడ్డకోసం జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగారు. మోహన్ బాబు పై మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్ బాబు ఖచ్చితంగా సారి చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మీడియా సంఘాలు ఆందోళనకు పిలుపు ఇచ్చారు. మీడియాప్రతినిధిపై దాడి చేయడంతో పాటు అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడటం మరింత వివాదానికి దారి తీసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.