AR Rahman : ఆమె వ‌ల్ల‌నే రెహమాన్‌కి డైవ‌ర్స్ అన్నారు.. ఇప్పుడు తండ్రి లాంటి వాడ‌ని అంటున్న మోహిని

AR Rahman : ఆమె వ‌ల్ల‌నే రెహమాన్‌కి డైవ‌ర్స్ అన్నారు.. ఇప్పుడు తండ్రి లాంటి వాడ‌ని అంటున్న మోహిని

AR Rahman : ఇటీవ‌లి కాలంలో స్టార్ సెల‌బ్రిటీల విడాకుల వ్య‌వ‌హారం ఎంత ర‌చ్చ‌గా మారుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. ఎంతో అన్యోన్యంగా ఉండే క‌పుల్స్ ఏవో కార‌ణాల వ‌ల‌న విడిపోతుండ‌డం ప్ర‌తి ఒక్క‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. రీసెంట్‌గా స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేయ‌డంతో అంరు షాక్ అయ్యారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంతో అనేక ప్ర‌చారాలు కూడా సాగాయి. ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే మోహినిదే కూడా డివోర్స్‌పై ప్రకటన చేయడంతో రెండు విడాకులకు ఏదైనా సంబంధం ఉందా? అంటూ చాలా మంది చర్చించుకోవడం మొదలు పెట్టారు.

అదే స‌మ‌యంలో రెహమాన్ భార్య సైరా తరఫు లాయర్‌ వందన స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్‌ – సైరా దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఇక త‌న విడాకుల‌పై వ‌స్తున్న పుకార్లకి సంబంధించి మోహినీ దే స్పందించారు. తనది, రెహమాన్‌ కుమార్తెలది ఒకే వయసు అని.. ఆయనెప్పుడూ తనని కుమార్తెలానే చూసేవారంటూ చెప్పుకొచ్చింది.రెహ‌మాన్ అంటే నాకు చాలా గౌర‌వం. ఆయ‌న తండ్రితో స‌మానం. త‌న కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన అత‌నిపై ఇలాంటి వార్త‌లు రావ‌డం బాధ క‌లిగిస్తుంది.

సున్నితమైన అంశాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం సరికాదని పేర్కొంది. ఇక్కడితో ఈ రూమర్స్‌కు పుల్‌స్టాప్‌ పెట్టి.. తమ గోప్యతను గౌరవించాలని ఓ వీడియో విడుదల చేసింది. మోహినిదే కోల్‌కతా నివాసి కాగా, ఆమె ముంబయిలో పెరిగింది. ఆమె బాస్‌ ప్లేయర్‌. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె వయసు 29 సంవత్సరాలు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. తన పెర్​ఫార్మెన్స్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తుంటుంది. ఆమెకు 527కే ఫాలోవర్స్ కూడా ఉన్నారు. రెహ‌మాన్ విడాకుల ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల‌లో మోహినీ కూడా విడాకుల ప్ర‌క‌ట‌న చేయ‌డంతో అంద‌రిలో అనేక అనుమానాలు త‌లెత్తాయి.