Mokshagna : నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఇటీవల ప్రకటన విడుదలైంది. . పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించారు బాలయ్య. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ సినీమాటికీ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సినిమా (‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ పేర్కొంటున్నారు) మూవీ కావడం విశేషం. ఇప్పటికే మోక్షజ్ఞ నటనలో మెళకువలు నేర్చుకోవడంతో పాటు ఫైట్లు, డాన్సులలో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకోబోతున్నాడు.
ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లుక్ ను షేర్ చేసారు. అద్దంలో ఉన్న మోక్షజ్ఞను లుక్ ను ప్రశాంత్ వర్మ షేర్ చేసాడు. సింబా ఈజ్ కమింగ్ అంటూ ట్వీట్ చేసాడు. సింహం కడుపున సింహమే అన్నట్టుగా ఫ్యాన్స్ కూడా మోక్షు తాజాగా లుక్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమా పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్ పతాకం బాలయ్య కూతురు తేజస్విని ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. హనుమాన్ తర్వాత పూర్తి సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ.. భారీ ఇప్పటి వరకు తెరకెక్కని సబ్జెక్ట్ తో సోషియో ఫాంటసీ.. మైథాలజీ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఒకప్పుడు చాలా లావుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు ఇలాంటి క్యూట్ లుక్ లో కనిపించే సరికి అభిమానుల ఆనందం అవధులు దాటుతుంది. రానున్న రోజులలో నందమూరి బాలయ్య పేరు మోక్షజ్ఞ తప్పక నిలబెడతాడని పలువురు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం కఠినమైన శిక్షణ పొందాడు. నందమూరి అభిమానులను మరియు సాధారణ సినీ ఔత్సాహికులను ఆకర్షించడానికి నటన, ఫైట్లు మరియు నృత్యంలో శిక్షణ సైతం తీసుకున్నాడు. ఇక ప్రేక్షకులని అలరించడమే తరువాయి. తొలి మూవీతో మోక్షజ్ఞ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.