Mrunal Thakur : పెళ్లి కూతురు గెట‌ప్‌లో సీతారామం బ్యూటీ.. ఏంటి ఈ అమ్మ‌డు ఏడడుగులు వేయ‌బోతుందా?

Mrunal Thakur : పెళ్లి కూతురు గెట‌ప్‌లో సీతారామం బ్యూటీ.. ఏంటి ఈ అమ్మ‌డు ఏడడుగులు వేయ‌బోతుందా?

Mrunal Thakur : ప్ర‌స్తుతం నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హవా న‌డుస్తుంది. హిందీ చిత్రాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుసగా ఆఫర్లు అందుకుంటున్న ఈ అమ్మ‌డు తెలుగులో ‘సీతారామం’తో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారి సందడి చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా ఫుల్ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మహారాష్ట్ర, ధులేలో 1992 ఆగస్టు 1న జన్మించింది. ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేేసుకుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మృణాల్ ఠాకూర్ అప్పుడ‌ప్పుడు గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల‌కి అదిరిపోయే కిక్ ఇస్తుంటుంది. అయితే మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేయ‌గా, ఇందులో పెళ్లికూతురుగా అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. పింక్ బోర్డర్​లో ఎల్లో శారీ కట్టుకుని.. హెవీ జ్యూవెలరీ పెట్టుకుని.. అందంగా ముస్తాబైంది. పువ్వులు పెట్టుకుని పెళ్లి బొట్టులో అందంగా కనిపించింది.ఇలా చూసి అంద‌రు అవాక్క‌య్యారు. ఏంటి మృణాల్ ఏడ‌డుగులు వేస్తుందా అని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె అందాన్ని చూసి కూడా మంత్ర ముగ్ధులు అయ్యారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే పెళ్లికూతురుగా ముస్తాబై శారీలను ప్రమోట్ చేసింది మృణాల్.

మృణాల్ వయసు ప్ర‌స్తుతం 32 సంవత్సరాలు కాగా, ఈమె కూడా పెళ్లి చేసుకుంటుందేమోనని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక మృణాల్ ఠాకూర్ హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరించింది. కానీ అమ్మడుకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. హిందీలో షాహిద్ కపూర్ నటించిచన జెర్సీ సినిమాతోనూ నటిగా ప్రశంసలు అందుకుంది ఈ వయ్యారి.ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో అలరించిన మృణాల్.. తెలుగులో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.