విధి వైపరిత్యం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి.ఒకప్పుడు దర్జాగా బ్రతికిన వాళ్లు సడెన్‌గా రోడ్డున బిక్షాటన చేస్తుండడం మనలాంటి వారిని ఎంతో కలిచి వేస్తుంది. మనదేశంలో చాలా మంది బెగ్గర్స్ ఉండగా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ట్రాజెడీ స్టోరీ ఉంటుంది. అయితే బెంగళూరుకు చెందిన ఓ బెగ్గర్ కథ వింటే షాక్ అవుతారు. అతని గెటప్, మాట్లాడే భాష చూస్తే అస్సలు బిచ్చగాడిలా కనిపించడు. కానీ, రోడ్లపై తిరుగుతూ ఆహారం కోసం భిక్షాటన చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ యువకుడు అతన్ని పలకరించాడు. ఫుడ్ పెట్టి అతడి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అతడు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యాడు.
బెంగళూరులో బిక్షాటన చేస్తున్న బెగ్గరు అమెరికాలోని ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. మైండ్‌ట్రీ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరి సంతోషంగా జీవితం గడిపాడు. తన లక్ష్యాలను తీర్చుకోవడంతో పాటు తల్లిదండ్రులకు గర్వకారణమయ్యాడు. అయితే ఓ విషాద ఘటన ఈ ఇంజనీర్ జీవితాన్నే మార్చేసింది. అమెరికాలో ఉంటున్న ఈ ఇంజనీర్‌కి ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త తెలుసుకున్న బాధితుడు ఒక్కసారిగా అనాథ అయిపోయాడు. ఈ బాధలో ఉండగానే అప్పటివరకు కలిసి కలలుగన్న ప్రేమికురాలు బ్రేకప్ చెప్పేసింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడేసరికి కోలుకోలేకపోయాడు.
లోలోపల కుమిలిపోవడంతో ఆందోళన, డిప్రెషన్ పెరిగి మానసిక అనారోగ్యానికి గురయ్యాడు.అప్పటినుంచి ఉద్యోగం వదిలేసి ఇలా బెంగళూరు రోడ్లపై అనామకుడిలా తిరుగుతున్నాడు. అయితే, ఈయన మాటల్లో మాత్రం తానెంత విద్యావంతుడో, టాలెంటెడ్ పర్సనో తెలిసిపోతుంది. ఈ బెగ్గర్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన యాక్షన్స్ కాస్త మతిమరుపు వ్యక్తిలా అనిపిస్తున్నాయి. కానీ, మాటల్లో మాత్రం స్పష్టత, లాంగ్వేజీ, సబ్జెక్టుపై పట్టు కనిపిస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఐన్‌స్టీన్ కన్నా ముందు ఫిజిక్స్‌లో మరో గొప్ప వ్యక్తి ఉండేవాడని.. ఆయనే సర్ ఐజాక్ న్యూటన్ అంటూ గుర్తు చేశాడు. ఐన్‌స్టీన్‌కి నోబెల్ పురస్కారం అంత ఈజీగా రాలేదని, తన సాపేక్ష సిద్ధాంతం కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డాడో వివరించాడు. ఆర్కిమెడిస్, జర్మన్ ఫిలాసఫీ వంటి పేర్లను ప్రస్తావించాడు.