Naga Chaitanya : కాబోయే అత్త‌,మామ గారి కుటుంబంపై నాగ చైత‌న్య ప్ర‌శంస‌ల వ‌ర్షం

Naga Chaitanya : కాబోయే అత్త‌,మామ గారి కుటుంబంపై నాగ చైత‌న్య ప్ర‌శంస‌ల వ‌ర్షం

Naga Chaitanya : అక్కినేని ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. డిసెంబ‌ర్ 4న నాగ చైత‌న్య‌, శోభిత వివాహం అన్న‌పూర్ణ స్టూడియోలో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. పెళ్లికి ముందు జరిగే వేడుకలు శోభిత ఇంట మొదలయ్యాయి. సోమవారం శోభిత ఇంట్లో పెళ్లి కూతురు వేడుక జరిగింది. ఈ సందర్భంగా శోభిత కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. పెళ్లి కూతురు వేడుకలో శోభిత చాలా సంతోషంగా కనిపించారు. బంధువులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో నాగ చైతన్య వివాహం జరగనుంది. పెళ్లి కూతురు చేసిన స‌యంలో శోభిత ఎర్ర చీర, మాంగ్ టీకా, సింపుల్ నెక్లెస్‌తో శోభిత అందంగా ముస్తాబయ్యారు.దీంతో అక్కినేని వారి కొత్త కోడలు శోభిత పెళ్లి కూతురు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగ చైత‌న్య‌, శోభిత వివాహం చేసుకోనున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో అటు నాగ చైతన్య, ఇటు శోభిత ఇద్దరికీ మంగళస్థానాలు పూర్తి చేశారు. మరొకవైపు పెళ్లి పనులు కూడా దాదాపు ప్రారంభం అయ్యాయి. బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగబోతోందని సమాచారం. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగచైతన్య శోభిత కుటుంబం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. శోభిత వివాహం తర్వాత సినిమాల్లో నటిస్తారా? అని అక్కినేని నాగచైతన్యను ప్రశ్నించగా..ఆయన మాట్లాడుతూ.. కచ్చితంగా నటిస్తుంది అని తెలిపారు.

ఇక ఆమె కుటుంబం గురించి మాట్లాడుతూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.. ప్రతి తెలుగింటిలాగే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారవంతమైన కుటుంబం. ఆప్యాయతతో కూడుకున్నది. నన్ను సొంత కొడుకు లాగా చూసుకుంటారు” అంటూ కాబోయే అత్తగారి కుటుంబం పై నాగ చైత‌న్య ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నాగ చైతన్య గ‌తంలో స‌మంత‌ని వివాహం చేసుకోగా, విబేధాల వ‌ల‌న వారిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. స‌మంత నుండి మరుసటి ఏడాదే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా లండన్ లో ఒక హోటల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో అప్పుడే మీడియాలో వార్తలు కోడై కూశాయి. కాని వారిద్ద‌రు దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆగ‌స్ట్ 8న వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, అప్పుడు వారి రిలేష‌న్‌పై అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది