Naga Chaitanya : నాకు ఇద్ద‌రు పిల్ల‌లు చాలు.. కూతురు పుడితే ఏం చేస్తానంటే.. నాగ చైత‌న్య కామెంట్స్

Naga Chaitanya : నాకు ఇద్ద‌రు పిల్ల‌లు చాలు.. కూతురు పుడితే ఏం చేస్తానంటే.. నాగ చైత‌న్య కామెంట్స్

స‌మంత నుండి విడిపోయి శోభిత‌తో ప్రేమ‌లో ప‌డి దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నాగ చైత‌న్య డిసెంబ‌ర్ 4న ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. ఇక పెళ్లి త‌ర్వాత శ్రీశైలం వెళ్లి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌,శోభిత‌ల‌కి సంబంధించిన ఏ చిన్న వార్త అయిన నెట్టింట వైర‌ల్ అవుతుంది. తాజాగా నాగ చైత‌న్య‌..రానా హోస్ట్ చేస్తున్న షోలో పాల్గొన్నాడు. ఇందులో రానా.. 50 ఏళ్ల తరువాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావ్ అని చైని అడగగా.. ” ఇద్దరు పిల్లలు.. సక్సెస్ ఫుల్ లైఫ్. సక్సెస్ అంటే ఏంటో అనుకుంటారు. నా దృష్టిలో సక్సెస్ అంటే.. జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటే అదే సక్సెస్ అని త‌న ఫ్యూచ‌ర్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు.

50 ఏళ్ళ వయస్సులో ఇద్దరు పిల్లలతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్లి తనతో రేసింగ్ చేస్తాను.. అదే కూతురు అయితే తనకు ఎందులో ఇష్టముందో అందులో ఎదగమని ప్రోత్సహిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపాలని అనుకుంటాను.. చిన్నప్పుడు మనం ఎలాంటి క్షణాలను అయితే అనుభవించామో వారికి కూడా అలాంటి క్షణాలను ఇవ్వాలని నేను ఎంత‌గానో భావిస్తాను అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

అంటే.. చై కు తండ్రిగా మారాలని చాలా కోరికగా ఉంది.. త్వరలోనే అది నిజం అవ్వాలని కోరుకుంటున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఆ మ‌ధ్య స‌మంత కూడా మాతృత్వం గురించి కామెంట్ చేసింది. గతంలో తాను తల్లిని కావాలని కళలు కన్నట్లు పేర్కొంది. మాతృత్వం అనేది పరిపూర్ణమైన అనుభూతి అని సమంత పేర్కొంది. అయితే తాను మాతృత్వాన్ని ఆస్వాదించడానికి ఇంకా టైం ఉందని పేర్కొంది. చైతన్యతో విడిపోయాక సమంత పిల్లలు కనడం గురించి మాట్లాడంతో ఆమె కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక చై కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది.