Naga Chaitanya : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత నాలుగేళ్ల పాటు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన మనస్పర్ధల వలన ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కలిసింది లేదు. ఇక నాగ చైతన్య ఏడాది పాటు సోలోగా ఉండగా, ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు.లండన్‌లో వీరిద్దరు కలిసి తిరిగిన పిక్స్ బయటకు రావడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. దానిని వారు ఏనాడు ఖండించలేదు. అయితే ఆగస్ట్ 8న ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడంతో అందరికి క్లారిటీ వచ్చింది. ఇక ఈ జంట డిసెంబర్ 4న పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. అక్కినేని ఇంట పెళ్లి వేడుకను చూసేందుకు అభిమానులు కళ్లలో ఓత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే అన్న పూర్ణ స్టూడియోను గ్రాండ్ గా ముస్తాబు చేసినట్లు తెలుస్తొంది. అయితే.. వీరిద్దరి పెళ్లి రాత్రి పూట 8 తర్వాత జరుగనున్నట్లు తెలుస్తొంది. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం… దాదాపు 8 గంటల క్రతువు ఉండనున్నట్లు తెలుస్తొంది. అయితే.. శోభిత, చైతుల మంగళస్నానాలు ఇటీవల గ్రాండ్ గా అన్న పూర్ణ స్టూడియోస్ లో జరిగడం మనం చూశాం. అయితే పెళ్లికి మరి కొద్ది గంటల సమయం ఉండగా, ఈ సమయంలో చైతన్య సోషల్ మీడియా పేజ్‌లో సమంతతో కలిసి ఉన్న రొమాంటిక్ బయటపడడం చర్చనీయాంశంగా మారింది. డివోర్స్ తీసుకున్న తర్వాత ఇటు నాగ చైతన్య, అటు సమంత ఇద్దరూ పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. సమంత అయితే ఒక అడుగు ముందుకేసి తన వెడ్డింగ్ గౌన్ ను కూడా మార్చేసింది.
సమంతతో నాగచైతన్య ఉన్న ఆఖరి ఫోటోను కూడా డిలీట్ చేశాడు. కాని ఆయన ఇంస్టాగ్రామ్ లో మజిలీకి సంబంధించిన మెమొరీ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రొఫెషనల్ గా ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో ఈ పోస్టర్ ను పోస్ట్ చేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన ఈ పోస్ట్ ని డిలీట్ చేయకపోవడానికి కారణం అది సినిమాకు సంబంధించిన విషయం కాబట్టి అంటున్నారు. అలాగే నాగ చైతన్య ఇప్పట్లో ఆ పోస్టర్ ను డిలీట్ చేసేలా కనిపించట్లేదు. అయితే కొందరు మాత్రం దానిని కూడా డిలీట్ చేయాలని అంటున్నారు