Naga Chaitanya-Sobhita : నాగ చైత‌న్య‌, శోభిత‌ల పెళ్లికి గెస్ట్‌ల లిస్ట్ చాలా పెద్ద‌దే..ఎవ‌రెవ‌రు హాజ‌ర‌వుతున్నారంటే..!

Naga Chaitanya-Sobhita : నాగ చైత‌న్య‌, శోభిత‌ల పెళ్లికి గెస్ట్‌ల లిస్ట్ చాలా పెద్ద‌దే..ఎవ‌రెవ‌రు హాజ‌ర‌వుతున్నారంటే..!

Naga Chaitanya-Sobhita : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్ష‌ణం రానే వ‌చ్చింది. నాగ చైత‌న్య‌,శోభిత‌లు మ‌రి కొద్ది గంట‌ల‌లో వైవాహిక బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. డిసెంబ‌ర్ 4 రాత్రి 8:13 ని.ల‌కి నాగ చైత‌న్య‌, శోభిత‌లు ఏడ‌డుగులు వేయ‌నున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబం ప్రత్యేకంగా భావించే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. పెళ్లికి పరిమిత సంఖ్యలో మాత్రమే బంధువులు, సన్నిహితుల్ని ఇరు కుటుంబాలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలతో శోభిత ధూళిపాళ్ల అప్‌డేట్స్ ఇస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ వివాహ వేదికని ఏర్పాటు చేయ‌గా, తాత ఆశీస్సుల‌తో పెళ్లి చేసుకోవాల‌ని చైతూ భావించాడు. ఈ పెళ్లికి అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబంతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరుకానున్నారు. అలానే ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్‌ హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ ఈ పెళ్లికి రావడంపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెళ్లికి హాజరయ్యే లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఈ సెలెబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందట. అలాగే..తండేల్‌ మూవీ యూనిట్ పెళ్లికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది

వైఎస్ జ‌గన్ ఫ్యామిలీ కూడా ఈ పెళ్లికి రాబోతున్నార‌నే టాక్ న‌డుస్తుంది. మరి పెళ్లి త‌ర్వాత రిసెప్ష‌న్ ఏమైన ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇక స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత ఏడాది పోటు సోలోగా ఉన్న నాగ చైత‌న్య ఆ త‌ర్వాత శోభిత‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు.నాగ చైతన్య, శోభితాలు గత రెండు ఏండ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగిన ఓ పోటీకి ఈవెంట్లో శోభితాను తొలిసారి కలుసుకున్నామని, ఆ మాటల్లోనే తన మంచి మనసు తనను కట్టిపడేసిందని అన్నారు. మా ఇద్దరికీ ఎన్నో ఉమ్మడి పోలికలు ఉన్నాయని, ఒకరికొకరం బాగా అర్థం చేసుకున్నామని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. శోభితా కుటుంబానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుందని తెలిపారు. అందుకే ఆమెతో కలిసి జీవితం పంచుకోటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అని నాగచైతన్య ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు.