Naga Chaitanya- Sobhita : పెళ్లి ఫోటోలు షేర్ చేసిన శోభిత‌.. చైతూని ఓ రేంజ్‌లో ఆట‌ప‌ట్టించిందిగా..!

Naga Chaitanya- Sobhita : పెళ్లి ఫోటోలు షేర్ చేసిన శోభిత‌.. చైతూని ఓ రేంజ్‌లో ఆట‌ప‌ట్టించిందిగా..!

Naga Chaitanya- Sobhita: స‌మంతతో విడాకుల త‌ర్వాత శోభిత ప్రేమ‌లో ప‌డ్డ నాగ చైత‌న్య ఎట్ట‌కేల‌కి ఆమెని వివాహం చేసుకున్నాడు. హైద‌రాబాద్‌లోన అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ స‌భ్యులు, ఆత్మీయుల స‌మ‌క్షంలో వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది. అయితే పెళ్లికి సంబంధించిన రెండు మూడు ఫొటోల‌ని మాత్ర‌మే నాగార్జున షేర్ చేయ‌గా, వేడుక‌లో ఏం జ‌రిగిందో అభిమానుల‌కి తెలియ‌రాలేదు. ఈ నేప‌థ్యంలో శోభిత ధూళిపాళ్ల త‌న సోష‌ల్ మీడియాలో పెళ్లి హంగామాకి సంబంధించిన కొన్ని పిక్స్ షేర్ చేసింది. కొత్తజంట స్వయంగా తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పిక్స్ వైర‌ల్‌గా మారాయి

ఇక పిక్స్ చూస్తుంటే అల్లరిగా, సందడిగా, సంతోషంగా ఆ పెళ్లి జరిగిందని అర్థమవుతుంది. పెళ్లి తర్వాత ఈ జంట శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కినేని నాగార్జున దగ్గరుండి మరీ ఈ నూతన వధూవరులతో పూజలు చేయించారు. రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత నుండి శోభిత ధూళిపాళ్ల ఎప్పటికప్పుడు పెళ్లి ఏర్పాట్లపై సోషల్ మీడియాలో ఫొటోలతో సహా అప్‌డేట్స్ ఇస్తూ వచ్చింది. రీసెంట్‌గా పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేసి ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచెత్తింది.

పెళ్లి తర్వాత శోభిత తాజాగా ఓ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో చైతన్యలో తనకు నచ్చే అంశాలు ఏంటి అని తెలిపింది. శోభిత మాట్లాడుతూ.. చై సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయగా ఉండటం నన్ను ఫస్ట్ ఆకట్టుకున్నాయి. చై అందరితో చాలా మర్యాదగా ఉంటాడు. అందరితో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్ గా ఉంటాడు. అతనిలో నాకు నచ్చే అంశాలు అవే. చాలా కేరింగ్ పర్సన్ కూడా. నన్ను బాగా ప్రేమిస్తాడు. ఎలాంటి ప్రేమ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసానో అది చైతూ దగ్గర్నుంచి దొరికింది. అలాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం అని తెలిపింది. దీంతో శోభిత కామెంట్స్ నెట్టింట‌ వైరల్ గా మారాయి. ఈ జంట అయిన క‌ల‌కాలం నిండు నూరేళ్లు సుఖ సంతోషాల‌తో క‌లిసి ఉండాలని నెటిజ‌న్స్ కోరుకుంటున్నారు.