Naga Chaitanya-Sobhita : నాగ చైత‌న్య‌- శోభిత హల్దీ వేడుక‌.. అక్కినేని ఇంట సంబ‌రాలు షురూ..!

Naga Chaitanya-Sobhita : నాగ చైత‌న్య‌- శోభిత హల్దీ వేడుక‌.. అక్కినేని ఇంట సంబ‌రాలు షురూ..!

Naga Chaitanya-Sobhita : అక్కినేని ఇంట ఇక సంద‌డే సంద‌డి. ఆగ‌స్ట్‌లో నాగ చైత‌న్య‌-శోభిత‌ల ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌గా, వీరి పెళ్లి డిసెంబ‌ర్ 4న జ‌ర‌గ‌నుంది. ఇక అఖిల్- జైన‌బ్ నిశ్చితార్థం రీసెంట్‌గా జ‌ర‌గ‌గా, వారి వివాహం వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నుంది. అయితే డిసెంబ‌ర్ మొద‌టి వారంలో చైతూ-శోభిత పెళ్లి కావ‌డంతో అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత మంగళస్నానాలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే హల్దీ ఫంక్షన్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ఇద్దరు కలిసి మంగళ స్నానాలు చేశారు. కుటుంబ స‌భ్యుల‌తో పాటు స‌న్నిహితులు ఈ వేడుక‌లో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇటీవల శోభిత ధూళిపాల పెళ్లికి సంబంధించిన విషయాలను ఆమె సోదరి డాక్టర్ సమంత ధూళిపాల కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.. తన సోదరితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ హింట్ ఇచ్చారు. ఇలా పెళ్లికి సంబంధించిన వేడుకలను ధూళిపాల ఫ్యామిలీ సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అయితే డిసెంబర్ 4వ తేదీన జరిగే నాగచైతన్య పెళ్లిలో భాగంగా జరుగాల్సిన హల్దీ, సంగీత్, మెహందీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీన, మెహందీ , సంగీత్ 3వ తేదీన నిర్వహిస్తారని తెలుస్తుంది.

ఇక‌ ఈ వేడుకల్లో ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఉంటారని తెలియవచ్చింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకతోపాటు వివాహం కార్యక్రమాన్ని 22 ఎకరాల్లో ఉన్న ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కుటుంబానికి భావోద్వేగంతో కూడిన బంధం అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్నందున.. ఆయన సమక్షంలో, ఆయనకు ఇష్టమైన ప్రాంతంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.కాగా, నాగచైతన్య, శోభితా ఇద్దరి లవ్ అఫైర్ విషయం ఇంగ్లాండ్‌లో వారిద్దరి వేకేషన్ ద్వారా బయటకు వచ్చింది. అయితే ఎన్నడూ ఇద్దరు తమ ప్రేమ వ్యవహారంపై పెదవి విప్పకుండా మౌనంగానే సమాధానం చెప్పారు. మీడియాలో పలు రకాల ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్ అడ్డు కట్ట వేస్తూ వారిద్దరి డైరెక్టుగా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొన్నారు.