Naga Babu : పుష్ప‌2 రిలీజ్ వేళ ర‌చ్చ‌గా మారిన నాగ‌బాబు ట్వీట్

Naga Babu : పుష్ప‌2 రిలీజ్ వేళ ర‌చ్చ‌గా మారిన నాగ‌బాబు ట్వీట్

Naga Babu : ఈ మ‌ధ్య మెగా వ‌ర్సెస్ అల్లు వివాదం తెలుగు రాష్ట్రాల‌లో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు మెగా హీరోగా ఉంటూ వ‌చ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయ‌న చేసిన ప‌నులు కూడా విమ‌ర్శ‌ల బారిన ప‌డేలా చేస్తుంది. ఇటీవ‌ల అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లారు. భార్యతో కలిసి నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే అంతకు ఒక్కరోజు ముందే ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు.

శిల్పారవికి మద్దతుగా ట్వీట్ చేస్తే సరిపోదని.. అందుకే ఇంటికి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నానని ఆ స‌మ‌యంలో అల్లు అర్జున్ అన‌డంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. నాగ‌బాబు కూడా ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు.మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే” అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట చ‌ర్చ‌కి దారి తీసింది. ఇక ఈ వివాదం స‌ద్ధుమ‌ణిగింది అనుకునే లోపు మరోసారి ట్వీట్ వార్ మొదలు పెట్టాడు నాగ‌బాబు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.

అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అవ్వడం మొదలయ్యాయి. అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే అంటూ సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు.పుష్ప 2 రిలీజ్‌కి రెండు రోజుల స‌మ‌యం మాత్రం ఉంది. ఈ స‌మ‌యంలో నాగ బాబు ఓ ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది., నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే మంచిది. వెంటనే నీ దారి మార్చుకో.. నువ్వు ఆలస్యం చేసే కొద్ది నీకె కష్టం. ఇది గుర్తు పెట్టుకో.. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావో అది మర్చిపోవద్దు లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. నాగబాబు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.