Nani :మన టాలీవుడ్ హీరోలలో చాలా మందికి ఆధ్యాత్మికత ఎక్కువ. అయ్యప్ప మాలని చాలా మంది హీరోలు ధరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ప్రతి ఏడాది ఆయన అయ్యప్ప మాలలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే నాని దీక్ష పూర్తి కావడంతో రీసెంట్‌గా శబరిమల వెళ్లారు. అక్కడ నానిని గుర్తించిన అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఇక నాని అక్కడ చాలా సామాన్యుడిలా కనిపించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా నానితో ఉన్నారు. ఆయన కూడా ఫోటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇక నాని వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. ప్రస్తుతం నాని.. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్నారు. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. హిట్ 3 మూవీలో నాని జమ్మూ కాశ్మీర్ స్టేట్ పోలీస్ గా కనిపిస్తున్నారు. ఎస్పీ అర్జున్ సర్కార్ గా సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము లేపనున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకోగా, ఇందులో నాని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. నాని ఓ హిట్ కథలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్. విశ్వక్ సేన్, అడివి శేష్ సైతం ఈ పార్ట్ లో కనిపిస్తారు. సమ్మర్ కానుకగా 2025 మే 1న విడుదల కానుంది.
ఇక హిట్ సిరీస్ కి నాని నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన నాని.. వరుస చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. ఆ చిత్రాలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. హిట్ 3తో పాటు నాని మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారని సమాచారం. దసరా చిత్రంతో నానికి భారీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల తో రెండో మూవీ చేయనున్నట్టు ఇటీవల నెట్టింట వార్తలు వచ్చాయి.. హిట్ కాంబో రిపీట్ కానుందని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరోవైపు బలగం ఫేమ్ వేణుతో నాని ఒక మూవీ చేయాల్సి ఉండగా.. క్యాన్సిల్ అయ్యింది.