Bala Krishna : నందమూరి బాలయ్య అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్‌గా సాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ షో నాలుగో సీజన్ జరుపుకుంటుండగా, ఈ షోకి పలువురు గెస్ట్‌లు వచ్చి తెగ సందడి చేస్తున్నారు. ఆరో ఎపిసోడ్ కి నవీన్ పోలిశెట్టి, శ్రీలీల వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎపిసోడ్ లో మొదట నవీన్ పోలిశెట్టి వచ్చాడు. నవీన్ రాగానే బాలయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన కోసం ఓ కవిత రాసుకొచ్చానని తన స్టైల్‌లో చెప్పాడు. ఓ డప్పు వాయించే వ్యక్తిని పిలిచి డప్పు వాయిస్తుంటే నవీన్ కామెడీగా ఈ కవిత చెప్పాడు.
నవీన్ పోలిశెట్టి బాలయ్య గురించి చెబుతూ.. బాలకృష్ణ గారు వెయ్యని గెటప్ ఎక్కడ .. ఆయన వెయ్యని గెటప్ ఎక్కడ.. 50 ఇండస్ట్రీ ఇక్కడ.. ఫ్యాన్స్ కి ఇష్టం ఆయన ప్రతీ రూపం.. కానీ నా ఫేవరేట్ భైరవ ద్వీపం.. ఆల్వేస్ యంగ్.. ఏజింగ్ లైక్ ఫైన్ వైన్.. టైం ట్రావెల్ చెయ్యగలరు మన ఆదిత్య 369.. యంగ్‌స్టర్స్ కి ఆయన ఒక బడ్డీ.. గ్యాంగ్ స్టర్స్ కి ఆయన ఒక సమరసింహా రెడ్డి.. కఅయన ఇలాగే మనల్ని ఎంటర్టైన్ చేయాలయ్యా.. యా యా యా బాలయ్య.. అంటూ సరదాగా చెప్పి బాలయ్య బాబుని ఇంప్రెస్ చేసాడు నవీన్. ఆ తర్వాత బాలయ్య నటనలో 50 ఏళ్ళు పూర్తిచేసినందుకు బాలయ్య ఫోటో ఉన్న ఓ హ్యాండ్ మెయిడ్ పెయింటింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.
కొన్ని నెలల క్రితం తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా బాలయ్య చెప్పుకొచ్చాడు. నవీన్ పోలిశెట్టి తనకు యాక్సిడెంట్ అయిందని, ఆపరేషన్ అయిందని, రెస్ట్ తీసుకుంటున్నాను అని ఓ వీడియో ద్వారా తెలిపాడు. యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్లకు బయటకు వచ్చి బాలయ్య షోలో పాల్గొన్నాడు నవీన్. ఈ షోలో నవీన్ పోలిశెట్టి తన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చేతికి 3 ఫ్యాక్చర్స్ అయ్యాయి. వాటికి ఆపరేషన్ చేసారు. పూర్తిగా రికవర్ అవ్వడానికి కనీసం 8 నెలలు పట్టుద్ది అని డాక్టర్ చెప్పారు. కానీ ఈ బ్రేక్ లో సినిమా స్క్రిప్ట్స్ మీద కూర్చున్నాను. త్వరలో అనగనగా ఒక రాజు సినిమాతో వస్తాను. ఈ 8 నెలల సమయం మంచికే అనుకున్నాను. స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేసుకోడానికి ఉపయోగపడింది అని తెలిపారు.