Pushpa2 : డిసెంబర్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం పుష్ప2. గత కొద్ది సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 . ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల పవర్ ఫుల్ సాంగ్‌తో అలరించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. అసలు ఆ మధ్య రిలీజైన ట్రైలర్ ట్రాన్స్ నుంచి బన్నీ ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన కిస్సిక్ సాంగ్‌లో .. బన్నీ, శ్రీలీల స్టెప్స్ మాత్రం ఇరగదీశారు. ఊ అంటావా రేంజ్‌లోనే ఈ పాటలో కూడా లిరిక్స్ హైలేట్ అయ్యాయి. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఈ సినిమా రన్‌టైమ్ లాక్ అయింది.
పుష్ప రన్ టైం దాదాపు 3.21 గంటలు అని తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ 1.40 నిమిషాలు, సెకండ్ ఆఫ్ 1.51 నిమిషాలు అని తెలుస్తుండగా, దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ‘రాబిన్ హుడ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో భాగంగా నిర్మాత నవీన్ ఎర్నేనికి ‘పుష్ప 2’ రన్ టైమ్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి నవీన్ ఎర్నేని స్పందిస్తూ.. ” ‘పుష్ప 2’ రన్ టైమ్ విషయంలో మాకు ఎటువంటి కంగారు లేదు. సినిమా చూసిన తర్వాత రన్ టైమ్ విషయంలో ఎవ్వరూ కంప్లైంట్ చేయరు. అంత బాగుంటుంది సినిమా.మీకు మూడున్నర గంటలు కూర్చుకున్న ఫీలింగ్ అస్సలు కలుగదు. రెండున్నర గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’ కూడా 3 గంటల రన్ టైమ్ కలిగి ఉండగా, అది ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూశాం.
ఇక గతేడాది చివర్లో వచ్చిన ‘యానిమల్’ కూడా మూడున్నర గంటల రన్ టైమ్ ఉండగా, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప2 కూడా భారీ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో నిర్మాతలు, చిత్ర బృందం ఉంది.ష్ప1 దాదాపు మూడు గంటల నిడివి తో వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పుష్ప 2 కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నారు చిత్రబృందం. పుష్పరాజ్ కి ఈ మూవీ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కౌన్సిల వర్షం కురిపిస్తుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా స్పెషల్ అట్రాక్షన్ కానుంది.