Nayanthara : 1 నిమిషానికి 5 కోట్ల రెమ్యున‌రేష‌న్.. ఈ హీరోయిన్ అంత డిమాండ్ చేస్తుందా?

Nayanthara : 1 నిమిషానికి 5 కోట్ల రెమ్యున‌రేష‌న్.. ఈ హీరోయిన్ అంత డిమాండ్ చేస్తుందా?

ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో క్రేజ్ ఉన్న‌ప్పుడు భారీగా డిమాండ్ చేస్తున్నారు..ఇప్ప‌టి హీరోయిన్స్‌కి క్రేజ్ కొద్ది కాలం మాత్ర‌మే ఉండ‌గా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌య‌న‌తార ఇప్ప‌టికీ అదే హ‌వా చూపిస్తుంది. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఏమాత్రం వన్నె తగ్గని ఈ తార.. వరుస ఆఫర్లు సాధిస్తూ.. రెమ్యునరేషన్ ను కూడా రెట్టింపు చేస్తోంది. ఒక వైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్ లు.. ఇంకో వైపు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తోంది. ఇప్పుడు ఆమె రెమ్యున‌రేష‌న్ కొంద‌రు హీరోయిన్స్ క‌న్నా కూడా ఎక్కువ‌.

న‌య‌న‌తార 10 నుంచి 15 కోట్లు సినిమాను బట్టి డిమాండ్ చేస్తుందట. ఇక వాటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా రెమ్యున‌రేష‌న్‌ని గ‌ట్టిగానే అడుగుతుంద‌ట‌. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ కు సబంధించి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా టాటా స్కై కి సబంధించిన యాడ్ ను చేశారట. అయితే దాదాపు 50 సెకండ్ల వరకూ ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ చార్జ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నయన్ కు అంత డిమాండ్ ఏంటీ.. ఎందు అంతలా ఆమె వెనకు పడుతున్నారంటూ షాక్ అవుతున్నారు

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ర్ నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది. ఈసినిమాతో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. స్టార్ హీరో యష్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. నయనతార సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కాని టాక్సిక్ సినిమా కోసం ఆమె గట్టిగా డిమాండ్ చేసింద‌నే టాక్ వినిపిస్తుంది. అందుకు కార‌ణం ఈ చిత్రంలో యష్ సోదరిగా నయన్ నటిస్తోందంటూ టాక్. ఈ క్ర‌మంలోనే ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. మ‌రి ఈ వార్త‌ల‌లో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది. సినిమాల కోసం సౌత్‌లో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార.. మూవీ ప్రమోషన్స్‌కి మాత్రం హాజరవదు. ఈ విషయంలో ఇప్పటికీ నిర్మాతలు ఆమెపై ఫిర్యాదు చేస్తుంటారు. ‘నేనూ రౌడీనే’ సినిమా ప్రొడ్యూసరైన ధనుష్ కూడా అప్పట్లో ఆ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి కారణం నయనతార అని ఆరోపించిన విష‌యం తెలిసిందే.