Allu Arjun : అల్లు అర్జున్‌కి అంత మ‌తిమ‌రుపు ఉందా.. నెటిజ‌న్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారుగా..!

Allu Arjun : అల్లు అర్జున్‌కి అంత మ‌తిమ‌రుపు ఉందా.. నెటిజ‌న్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారుగా..!

Allu Arjun : పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప‌2తో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం అల్లు అర్జున్ పుష్ప‌2 కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుందంటే అతిశ‌యోక్తి కాదు.డిసెంబ‌ర్ 5న పుష్ప 2 చిత్రం విడుద‌ల కానుండ‌గా, పుష్ప-2 ప్రమోషన్స్‌ అదరగొడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. పాట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌, చెన్నైలో కిసిక్ సాంగ్ రిలీజ్‌..ఇలా వరుస ఈవెంట్లతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు. డిసెంబర్ ఒక‌టిన‌ హైదరాబాద్‌లో బిగ్‌ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇలా పుష్ప-2 షూటింగ్ స్టార్ట్‌ అయినప్పటి నుంచి నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు బ‌న్నీ.

పుష్ప‌2తో దాదాపు 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే పుష్ప‌2 ఒక‌వైపు జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుపుకుంటుండ‌గా, మరోవైపు ట్రోల‌ర్స్ ఏదో ఒక‌టి వెతికి బ‌న్నీపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల ట్ ఒకటి తమిళనాడులో చిత్రానికి సంబంధించి ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది. తమిళంలో స్పీచ్ ఇచ్చిన బ‌న్నీ.. చిన్నతనం అంతా చెన్నైలోనే గడవడం వల్ల తమిళం బాగా వచ్చు అని, మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నేలకి రెస్పెక్ట్ ఇవ్వాలని అల్లు అర్జున్ చెప్పాడు.ఇక అదే స్టేజిపై చేసిన డాన్స్ స్టెప్ విషయంలోనే కామెడీ మొదలైంది. తను రజనీకాంత్ సినిమాల కోసం క్యూ లో నిలబడి టికెట్లు కొన్న రోజులు కూడా గుర్తు చేసుకున్నాడు.

ఒక‌ప్పుడు నా డాన్స్ చూడాలంటే టికెట్ కొనుక్కుని థియేటర్లలో చూడాలని చెపుతాను.. కానీ మీకోసం మొదటిసారి స్టేజీపై డాన్స్ చేస్తాను అని చెప్పి చిన్న స్టెప్ వేశాడు బ‌న్నీ. అయితే అల్లు అర్జున్ గతంలో తనకి తానుగా చెప్పి మరీ స్టేజీపై డాన్స్ చేసిన సంద‌ర్భాల‌ని ఎత్తి చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. సరైనోడు సక్సెస్ మీట్ లో ‘నాకెందుకో ఇప్పుడు ఒక స్టెప్ వేయాలని ఉంది’ అంటూ డాన్స్ చేశాడు బన్నీ. దానికి ఒక రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి. అలాగే ఒక అవార్డు ఫంక్షన్ లో కూడా ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేశాడు. అది కూడా తానే కోరుకుని మరీ చేశాడు.మ‌రి ఇప్పుడు బ‌న్నీ ఇలా అన‌డం ఏంట‌ని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. పుష్ప2 ఒత్తిడిలో మతిమరుపు వచ్చిందా ఏమిటి అని కామెడీ చేస్తున్నారు.