Niharika : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క మహిళ నిహారిక. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన ‘డీ జూనియర్ ‘అనే డాన్స్ రియాల్టీ షోలో యాంకర్ గా వ్యవహరించింది నిహారిక. ఈ షో తో నిహారికకు మంచి పాపులారిటీ లభించింది. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ’అనే షార్ట్ ఫిలింలో నటించి అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత 2016లో ‘ఒక మనసు’అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తరువాత సూర్యకాంతం అనే సినిమాలో నటించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన నిహారిక డైవర్స్ తర్వాత తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టింది.
ఇటీవల పింక్ ఎలిఫెంట్ బ్యానర్ను స్థాపించి.. అందులో చిన్న చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే ‘కమిటీ కుర్రాళ్ళు’అనే సినిమాను తెరకెక్కించగా, ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. అయితే నిహారిక నిర్మాతగానే కాకుండా నటిగా కూడా తమిళంలో పలు సినిమాలు చేస్తుంది. తమిళ మూవీ మద్రాస్‌కారణ్ లో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్నాడు.మద్రాస్‌కారణ్ కోసం మణిరత్నం సఖి మూవీలోని కాయ్‌లవ్ చెడుగుడు అనే పాటను రీమిక్స్ చేస్తోన్నారు.
ఈ డ్యూయెట్ సాంగ్ ప్రోమోను ఇటీవల రిలీజ్ కాగా, ప్రోమోలో షేన్ నిగమ్, నిహారిక కెమిస్ట్రీ, రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్. గతంలో నిహారిక చేసిన సినిమాలకు మించి రొమాంటిక్‌గా ఈ సాంగ్ కనిపిస్తోంది. ఈ సాంగ్‌ను ఉద్దేశిస్తూ నెటిజన్లు నిహారికను దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఇలాంటి పాటల్లో నటించి నిహారిక మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తోందని అంటున్నారు. ఈ టైప్ సినిమాలు చేయడం అవసరమా …చక్కగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసుకోవచ్చుగా అంటూ కామెంట్స్ పెడుతోన్నారు. ప్రోమోలోనే ఈ రేంజ్ కెమిస్ట్రీ ఉంటే ఫుల్ సాంగ్‌లో ఇంక ఎంత ఉంటుందోనని ఓ నెటిజన్ అన్నాడు. ఇక నిహారిక వివాహం .. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయి తో జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. కానీ వేరే మూడు ముళ్ళ బంధం కూడా మూడు నాలుగు ముచ్చటగానే మారిపోయింది. కేవలం రెండేళ్లలో విడాకులు తీసుకొని దూరమయ్యారు.