Niharika : వామ్మో.. నిహారిక‌లో ఇంత టాలెంట్ ఉందా.. అస‌లు ఆ డ్యాన్స్ ఏంది ?

Niharika : వామ్మో.. నిహారిక‌లో ఇంత టాలెంట్ ఉందా.. అస‌లు ఆ డ్యాన్స్ ఏంది ?

Niharika : నాగ‌బాబు ముద్దులు కూతురు నిహారిక ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. అంతక ముందు యాంక‌ర్‌గా సంద‌డి చేసింది. ఒక మ‌న‌సు చిత్రం త‌ర్వాత నిహారిక ప‌లు సినిమాలు చేయ‌గా, అవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. దీంతో ఈ అమ్మ‌డు త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మపై ఫోక‌స్ పెట్టింది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన ఒరు న‌ళ్ల‌నాళ్ పాథు సోల్రెన్ మూవీలో నిహారిక న‌టించింది. 2018లో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా వ‌చ్చి పోయిన విష‌యం కూడా ఎవ‌రికి తెలియ‌దు. అయితే ఇప్పుడు తమిళంలో రెండు చిత్రాలను చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మలయాళీ ఆర్టిస్ట్ షేన్ నిగమ్, నిహారిక కలిసి మద్రాస్ కారన్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పాట ఒకటి రిలీజ్ చేశారు. మణిరత్నం, ఏ ఆర్ రెహమాన్ కాంబోలో వచ్చిన సఖి చిత్రంలోని కాలైవ్ చెడుగుడు పాటను రీమేక్ చేశారు. ఇక అందులో హీరో హీరోయిన్లు ఎంత రొమాంటిక్‌గా నటించారో.. ఈ రీమేక్ సాంగ్‌లోనూ అంతే రొమాంటిక్‌గా నిహారిక, షేన్ రెచ్చిపోయారు.నిహారిక ఇంతలా పర్ఫామెన్స్ చేస్తుందని, ఇంత బోల్డ్‌గా కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే బోల్డ్ ప‌ర్‌ఫార్మెన్స్ గురించి ప‌క్క‌న పెడితే నిహారిక డ్యాన్స్ మాత్రం అద‌ర‌గొట్టింది. ఈ అమ్మ‌డు ఆ రేంజ్‌లో డ్యాన్స్‌లు చేస్తుంద‌ని ఎవ‌రు ఊహించి ఉండ‌రు. అస‌లు నిహారిక‌లో ఇంత టాలెంట్ ఉందా, ఇంత అద్భ‌తుంగా డ్యాన్స్ చేయ‌గ‌ల‌దా అని అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక నిహ‌రిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు అయితే నిహారిక కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. దాదాపు 20 మంది కొత్త ఆర్టిస్టుల్ని, కొత్త టీంను టాలీవుడ్‌కు పరిచయం చేసి తన అభిరుచిని చాటుకుంది. నిర్మాతగా నిహారిక స్థాయిని పెంచింది కమిటీ కుర్రోళ్లు సినిమా అన్న సంగతి తెలిసిందే.ప్ర‌స్తుతం తెలుగులో వాట్ ది ఫిష్ మూవీలో నిహారిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. గ‌త ఏడాది డెడ్ పిక్సెల్స్ అనే వెబ్‌సిరీస్‌లో న‌టించింది. ఇటీవ‌ల సోనీ లివ్ ఓటీటీలో రిలీజైన బెంచ్ లైఫ్ వెబ్‌సిరీస్‌లో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. ఈ వెబ్‌సిరీస్‌ను నిహారిక‌నే ప్రొడ్యూస్ చేసింది.