Niharika : అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్‌లు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మొదట సమంతని పెళ్ళాడిన నాగ చైతన్య ఆమెకి బ్రేకప్ చెప్పి శోభితని వివాహమాడాడు. ఇక అఖిల్.. శ్రియా భూపాల్ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత ఆమెతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు జైనబ్ అనే అమ్మాయితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక కొద్ది రోజుల క్రితం మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఆమె కూడా త్వరలో ఓ వ్యక్తిని పెళ్లాడనుందంటూ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.
నిహారిక కొణిదెల… మెగా డాటర్ ఇమేజ్ తో పాటు.. ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంది. హోస్ట్ గా, హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా రకరకాల బాధ్యతలని మోస్తున్న ఈ భామ విడాకులు తరువాత మళ్లీ టాలీవుడ్ లో యాక్టీవ్ అయ్యింది. అయితే ఇప్పటి వరకూ నిహారిక గురించి వినిపించని ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. నిహారిక రెండో పెళ్ళి. విడాకుల తర్వాత నిహారికకి సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు విడాకులు తీసుకున్నారు కదా.. మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా అని అడిగారు చేసుకోకపోవడానికి నాకేమి వయస్సు అయిపోలేదు కదా. నా ఏజ్ చాలా తక్కువ. నా కేరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకు ఉంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అని చెప్పింది.
ఇప్పుడు నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమించిందని. అతనితోనే మూడు ముళ్ళు వేయించుకోబోతోందని వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.. మరి ఈ న్యూస్ లోనిజం ఎంత ఉందో తెలియదు కాని. సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న నిహారిక ఆమధ్య ఏపీ ఎలక్షన్స్ టైమ్ లో రాజకీయాల్లోకి కూడా వస్తుందని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. కాని అందులో నిజం లేదని ఆతరువాత తెలిసింది.