NLC ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు.. భారీ ఎత్తున నియామ‌క ప్ర‌క్రియ‌..

NLC ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు.. భారీ ఎత్తున నియామ‌క ప్ర‌క్రియ‌..

తమిళ‌నాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ ఇండియా లిమిటెడ్ (NLC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్ర‌క్రియ‌లో భాగంగా మొత్తం 588 గ్రాడ్యుయేట్‌, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు ఉన్నాయి. మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, కెమిక‌ల్‌, మైనింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ ఇంజినీరింగ్‌, న‌ర్సింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు గాను అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్ విధానంలో కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ద‌ర‌ఖాస్తుల‌ను స‌మర్పించేందుకు గాను డిసెంబ‌ర్ 23ను చివ‌రి తేదీగా నిర్ణయించారు. 588 పోస్టుల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులు 336 ఉండ‌గా, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులు 252 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల‌కు ఇంజినీరింగ్ లేదా టెక్నాల‌జీలో డిగ్రీ ఉత్తీర్ణ‌త క‌లిగి ఉండాలి. టెక్నిషియన్ పోస్టుల‌కు ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త ఉండాలి. న‌ర్సింగ్ పోస్టుల‌కు డిప్లొమా, బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి.

NLC India Limited trainee recruitment 2024 full details

ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల‌కు రూ.15వేలు, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల‌కు నెల‌కు రూ.12వేలు, న‌ర్సింగ్ పోస్టుల‌కు రూ.12వేలు ఉప‌కార వేత‌నం ఇస్తారు. అభ్య‌ర్థుల‌ను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివ‌రాల‌కు గాను www.nlcindia.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.