ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

దేశంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ అయిన నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌టీపీసీ) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఎన్‌టీపీసీలో సేఫ్టీ ఆఫీస‌ర్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 50 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క‌నీసం 60 శాతం మార్కుల‌తో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://ntpc.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఇంజినీరింగ్ డిగ్రీ చ‌దివి ఉండాలి. మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, ప్రొడ‌క్ష‌న్‌, కెమిక‌ల్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ వంటి ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారు అర్హులు. అలాగే డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా (ఇండ‌స్ట్రియ‌ల్ సేఫ్టీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ.30వేల నుంచి రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు 3 ఏళ్లు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

ntpc assistant officer recruitment 2024 full details and how to apply

అభ్య‌ర్థుల‌ను విద్యార్హ‌త‌లు, అఫ్లికేష‌న్ షార్ట్ లిస్టింగ్‌, స్క్రీనింగ్‌, రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజులో మిన‌హాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 26వ తేదీన ప్రారంభం కాగా ద‌ర‌ఖాస్తు చేసేందుకు డిసెంబ‌ర్ 10ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.