Pushpa 2 : దెబ్బ‌లు ప‌డ‌తయిరో అంటూ ఈ బామ్మ‌లు త‌మ డ్యాన్స్‌తో ర‌చ్చ చేశారుగా..!

Pushpa 2 : దెబ్బ‌లు ప‌డ‌తయిరో అంటూ ఈ బామ్మ‌లు త‌మ డ్యాన్స్‌తో ర‌చ్చ చేశారుగా..!

Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ చిత్రం పుష్ప‌2. ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ఇప్ప‌టికే 500 కోట్లకి పైగా వ‌సూళ్లు చేసి అందరికి షాక్ ఇచ్చింది. సినిమా కంటే ముందు సాంగ్స్ కూడా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 1 సినిమాలో కూడా సాంగ్స్ బాగా హిట్ అయి వరల్డ్ వైడ్ పుష్ప కు ఫేమ్ తెచ్చిన సాంగ్ ఊ అంటావా మామ‌.. ఊ ఊ అంటావా.. పాట. ఈ పాట‌కి స‌మంత చిందులు వేయ‌డంతో పాట‌కి ఎక్క‌డిలేని క్రేజ్ తెచ్చింది. ఈ నేప‌థ్యంలో పుష్ప 2 సినిమాలోను అలాంటి సాంగ్ ఒక‌టి పెట్టారు. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈ పాటకి డ్యాన్స్ చేయ‌గా, ఆ స్పెషల్ సాంగ్ వైరల్ అవుతుంది.దెబ్బలు పడతయిరో.. అంటూ శ్రీలీల కిస్సిక్ స్టెప్పులు థియేటర్స్ లో కుర్రకారుని హీట్ ఎక్కిస్తున్నాయి.

శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ థియేటర్లలో కుర్రకారును ఓ ఊపు ఊపేస్తుంది. ఈ పాటకు చిన్నా, పెద్ద తేడా లేకుండా నెట్టింట రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా కిస్సిక్ పాటకు బామ్మలు అదరగొట్టారు. దెబ్బలు పడతాయిరో.. అంటూ స్టెప్పులు వేశారు. కర్ణాటక బెలగాంలో ఉన్న శాంతయి వృద్ధాశ్రమంలో ఉన్న కొందరు బామ్మలు కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొట్టారు. ఈ పాట ఇప్పుడు నెట్టింట వైర‌ల్ కాగా, ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా శ్రీల‌ల‌ని మైమ‌రిపించారు అని అంటున్నారు.. పుష్ప టీమ్ కూడా ఈ వీడియో షేర్ చేసారు. కాగా, శాంతయి వృద్ధాశ్రమంలో ఉండే బామ్మలు, తాతయ్యలు చాలా యాక్టివ్ గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెగ్యులర్ గా ట్రెండ్ అవుతున్న పాటలకు బామ్మలు అందరూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు.

ఇక చిత్ర విజ‌యంపై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ క్రిటిక్స్. ఇందులో అల్లు అర్జున్ మాస్ నట విశ్వరూపం చూపించారని.. ఇక శ్రీవల్లి పాత్రలో రష్మిక సైతం జీవించేసిందని రివ్యూస్ ఇస్తున్నారు. ఈ మూవీ సుల‌భంగా వెయ్యి కోట్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా త‌ప్ప‌క బ‌న్నీ తిర‌గ‌రాస్తాడ‌ని ప్ర‌తి ఒక్క‌రు చెప్పుకుంటున్నారు.