Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చంపేస్తాంటూ బెదిరింపు కాల్స్.. నిందితుడి కోసం ట్రేస్ చేస్తున్న పోలీసులు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చంపేస్తాంటూ బెదిరింపు కాల్స్.. నిందితుడి కోసం ట్రేస్ చేస్తున్న పోలీసులు

Pawan Kalyan : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ని శాసిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఢిల్లీలోను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌త్యేకమైన క్రేజ్ ఉంది. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌లోను పవ‌న్ క‌ళ్యాణ్‌తో ప్ర‌చారం చేయించింది బీజేపీ ప్ర‌భుత్వం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కించుకున్న‌ప్ప‌టి నుండి చాలా అగ్రెసివ్‌గా వెళుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి బెదిరింపు కాల్స్ ఎక్కువ‌య్యాయి. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆయన పేషీకీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనను వదిలేది లేదంటూ ఓ అపరిచితుడు డిప్యూటీ సీఎం పేషీకీ అసభ్యకరమైన మెసేజ్ లు పంపటం అంతటా చర్చగా మారింది. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏపీ హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనిపై స్పందించారు. ఫోన్ కాల్, మెసేజ్ లు వచ్చిన నంబర్ ను ట్రేస్ చేసి నిందితుడుని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి చర్యలకు ఉపక్రమించే వారిని వదిలిపెట్టేది లేదంటూ అనిత హెచ్చరించారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ప్రజా ప్రతినిధులపై అసభ్యకరమైన పోస్టులు చేసినా, కామెంట్లు పెట్టినా ఎవ‌రిని వ‌దిలేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. అయితే ప‌వన్ పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు డీజీపీ నిర్థారించ‌గా, అత‌డిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అయితే పవన్‌‌ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అగంతకుడిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు.

నిందితుడు లబ్బీపేటలో ఉన్నట్లు సెల్‌ఫోన్ ట్రాక్ చేసి పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్బీపేటకు వెళ్లే సరికి ఆ అగంతకుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయ‌గా,టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. పవన్‌కు బెదిరింపుల వేళ మెగా బ్రదర్ నాగబాబు త‌న సోష‌ల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని.. పవన్‌తో స్నేహం చేయడం, అతనితో జట్టు కట్టడం, అతనికి సన్నిహితుడిగా ఉండడం, కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.. మరి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కి వ‌చ్చే బెదిరింపుల విష‌యంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.