Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణా, మ‌జాకానా.. అక్క‌డ కూడా ఆయ‌నే తోపు..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణా, మ‌జాకానా.. అక్క‌డ కూడా ఆయ‌నే తోపు..!

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ మాముల్ది కాదు. ఆయ‌న సినిమాల‌లోనే కాకుండా రాజకీయాల‌లోను త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ని కూడా శాసిస్తున్నాడు. ఢిల్లీలోను చ‌క్రం తిప్పుతున్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఏడాది అరుదైన ఘ‌న‌త సాధించాడు. గూగుల్ ఎక్కువ సెర్చ్ చేసిన విష‌యాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నిలిచాడు. క్రికెట్‌ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL).. గూగుల్‌ ఓవరాల్‌ జాబితాలో ఈ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితా లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు.

వ్యక్తుల గురించి అత్యధిక మంది సెర్చ్ చేసిన జాబితాలో పవన్ కల్యాణ్ కు చోటుదక్కింది. ఈ ఏడాది అత్యధికంగా వెతికన వాటిల్లో ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు.. ఇక సినిమాల విషయానికొస్తే స్త్రీ2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా.. ప్రభాస్‌ నటించిన కల్కి, సలార్‌ గురించి ఎక్కువ మంది వెతికారు. వీటితో పాటు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్‌ మూవీ కూడా ఉండ‌డం విశేషం.. ఇంకా.. హీరామండీ, మీర్జాపూర్‌ వెబ్ సిరీస్ ల గురించి కూడా గూగుల్లో అత్యధికంగా సెర్చ్‌ చేసినట్లు పేర్కొంది.

ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నాడు. పవన్‌ కళ్యాణ్ లైనప్‌లో ‘హరిహర వీరమల్లు’అనే ఓ ప్రాజెక్ట్‌ ఉందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయే స్టేజ్‌కు వచ్చారు. అప్పుడెప్పుడో పవన్‌ బర్త్‌డేకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, ఆ వెంటనే ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా పై ఎలాంటి అప్‌డేట్ లేదు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడేళ్ల క్రితమే పట్టాలెక్కింది. కానీ ప్యాసింజర్‌ ట్రైన్‌లా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తుంది. ఏంఎం రత్నం పెద్ద కొడుకు.. రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశాడు. పవన్ రాజకీయాల్లో బిజీ కారణంగా బ్రేకులు పడిన ఈ సినిమా ఇటీవలే మొదలైంది. పవన్ సైతం సెట్‌లో దిగిన సెల్ఫీ పంచుకున్నాడు. ప్ర‌స్తుతం మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.