గురుగ్రామ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజినల్ కార్యాలయాల్లో పలు విభాగాల్లో మొత్తం 71 ఆఫీసర్ ట్రెయినీ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, సోషల్ మేనేజ్‌మెంట్, హెచ్ఆర్, పీఆర్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు గాను దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాగా డిసెంబర్ 24వ తేదీ వరకు గడువు విధించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://www.powergrid.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. మొత్తం 71 ఖాళీలు ఉండగా ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, సోషల్ మేనేజ్‌మెంట్, హెచ్ఆర్, పీఆర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైం డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్ 2024 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి డిసెంబర్ 24, 2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.40వేలు ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక నెలకు రూ.50వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఇస్తారు. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషపన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.