Imax : భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప2 చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
దేశ మంతటా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో కోలాహలం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా దాదాపు అన్ని థియేటర్లలో పుష్ప2 ప్రదర్శితం అవుతోంది. అయితే మన హైదరాబాద్ నగరవాసులకు ఎంతో ఇష్టమైన ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మాత్రం పుష్ప2 బొమ్మ పడలేదు. సాధారణంగా ప్రతి సినిమాకి సంబంధించిన షో తొలి సారి అక్కడే ప్రదర్శించబడుతుంది. కాని పుష్ప2 మాత్రం పడకపోవడతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అందుకు గల కారణాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా సుమారు రెండు దశాబ్దాల నుంచి తాము వర్క్ చేస్తున్నామని ఎక్స్ వేదికగా ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ తెలిపింది. దురదృష్టవశాత్తూ, కొన్ని అనివార్య కారణాలతో ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో హీరో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2ను ప్రదర్శించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. మీకు అసౌకర్యం కల్పించినందుకు మేము చింతిస్తున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది. ‘పుష్ప 2’ చిత్రాన్ని ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలియజేయలేదు.
మరోవైపు ఐమ్యాక్స్ పక్కనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు జరుగుతుండటం, పోలీసు బందోబస్తు ఉండటం ఒక కారణమని తెలుస్తుండగా పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఆర్థిక విషయాల్లో బేధాభిప్రాయాలే కారణమని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రసాద్ ఐమ్యాక్స్ చరిత్రలో కరోనా కాలం మినహాయించి ఒక అగ్ర హీరో సినిమా ప్రదర్శన జరగకపోవడం అందరిని నిరాశకి గురి చేస్తుంది. పెద్ద సినిమాల విడుదల సమయంలో రోజుకు 36 ఆటలతో సందడిగా ఉండే ఐమ్యాక్స్ పరిసరాలు ప్రస్తుతం సందడి లేకపోవడం గమనార్హం.