Pushpa 2 : పుష్ప2 బ్రేక్ ఈవెన్ కోసం అన్ని కోట్లు రాబ‌ట్టాలా..టార్గెట్ చాలా పెద్ద‌దే.!

Pushpa 2 : పుష్ప2 బ్రేక్ ఈవెన్ కోసం అన్ని కోట్లు రాబ‌ట్టాలా..టార్గెట్ చాలా పెద్ద‌దే.!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంధాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌2. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రం రూపొందుతుంది. డిసెంబ‌ర్ 5న చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం మేక‌ర్స్ చాలా క‌ష్టాలు ప‌డుతున్నారు. క్షణం తీరిక లేకుండా పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై అంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇక హైద్రాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు మీడియాతోనూ ప్రత్యేకంగా చిట్ చాట్ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి గత నెల రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 టార్గెట్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

తెలుగుతోపాటూ తమిళ్, మలయాళం, హిందీ తదితర పాన్ ఇండియా భాషలలో మూవీని రిలీజ్ చేస్తుండ‌గా, తెలుగులో ఈ చిత్రాన్ని భారీ రేట్లుకే అమ్మారు. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత షేర్ రాబట్టుకోవాలి అనేది మీడియా వర్గాల్లో, అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది..ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రా ప్రాంతంలో రూ. 90 కోట్లు, నైజాంలో రూ. 100 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 కోట్లకు రైట్స్ అమ్ముడు అయ్యాయి. అంటే, మొత్తం రూ. 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పెద్ద హిట్ అవ్వాలంటే మొదట తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధిస్తే, అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్ రికార్డ్ గా నిలుస్తుంది. జరిగిన బిజినెస్ కు తగినట్లు 220 కోట్ల షేర్ రూపంలో వెనక్కి వచ్చి లాభాలు రావాలంటే… ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ. 450 నుంచి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో హయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు ‘ఆర్ఆర్ఆర్’ (415 కోట్లు)కి ఉన్నాయి. మొన్న వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఇచ్చినట్టు గానే భారీ హైప్‌ ని పుష్ప 2 కి కూడా ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది కానీ దానికి మించిన హైప్‌ కోసం మేకర్స్ చూస్తున్నారట.ఆ మొత్తాన్ని రికవర్ చేయాలి అంటే అంతకు మించిన హైప్‌ తప్పనిసరి అని మేకర్స్ అనుకుంటున్నారట. ‘పుష్ప 2’కు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అంత ఈజీ కాదని ట్రేడ్ అంటోంది. ఇది మామూలు టార్గెట్ కాదు. టికెట్ రేట్లు పెంచినా, మొదటి రెండు వారాల్లో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం చాలా కష్టమని ట్రేడ్ లెక్కలు వేసి చెప్తోంది. సంక్రాంతి వ‌ర‌కు ఈ మూవీ నిల‌క‌డ‌గా క‌లెక్ష‌న్స్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ చేయడం పెద్ద క‌ష్టం ఏమి కాద‌ని అంటున్నారు.