Pushpa 2 : పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అని బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. భారీ హైప్ నడుమ విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ క్రమంలో పుష్ప 2 కలెక్షన్స్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క హిందీలోనే ఈ మూవీ ఫస్ట్ డే రూ.65 – రూ.67 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ విశ్లేషకులు వెల్లడించారు. దీంతో ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ హిందీలో అదరగొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పుష్ప2 డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డు స్థాయిలో రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ. 425 కోట్ల వ్యాపారం చేసింది పుష్ప 2. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ. 275 కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ కింద రూ. 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద రూ.65 కోట్లు బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసిందట. డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు రూ. 10 కోట్లు రాబట్టింది.
డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో రూ.165 కోట్లు వసూలు చేసింది. దీని ద్వారా సినిమా మొత్తం వసూళ్లు రూ. 175 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుంటే పుష్ప సినిమా కలెక్షన్ దాదాపు రూ. 250 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో తొలి రోజు రూ. 133 కోట్లు వసూల్ చేసింది. అలాగే బాహుబలి రూ. 121కోట్లు, కేజీఎఫ్ రూ. 116 కోట్లు వసూల్ చేశాయి. ఈ రికార్డ్స్ ను పుష్ప2 బీట్ చేసింది.రూ. 1200 కోట్ల గ్రాస్ , రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పుష్ప 2కి నిర్దేశించారు ట్రేడ్ పండితులు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఏరుగని రీతిలో వరల్డ్ వైడ్‌గా దాదాపు 11000 వేల స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.