ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ మూవీ పుష్ప2. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన పుష్ప 2 ది రూల్ మూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్‌గా నిలిచింది. పుష్ప 2 ఫస్ట్ డే 165 కోట్లు రాబట్టి రాజమౌళి సినిమాల రికార్డ్ బ్రేక్ చేసినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. ఈ 165 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 85 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ. 67 కోట్లు, తమిళం నుంచి 7 కోట్లు, కర్ణాటకలో రూ. 1 కోటి, మలయాళంలో రూ. 5 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లుగా సక్నిల్క్ రఫ్ డేటా చెబుతోంది.
ఇక ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని చోట్ల సినిమా ప్రదర్శించలేదని రచ్చ చేశారు.తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పుష్ప సినిమా వేయలేదని థియేటర్‌పై కొంత మంది రాళ్లదాడికి దిగారు. అనంతరం థియేటర్ ఓనర్‌పై బెదిరింపులకి కూడా దిగారు. చెన్నైరులోని శ్రీనివాస థియేటర్‌లో మరమ్మతుల కారణంగా పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోయారు. దాంతో.. థియేటర్ ఓనర్ కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లిన కొంత మంది.. మూవీని ఎందుకు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన మరమ్మతుల సమాధానం నమ్మని వాళ్లు గొడవకి దిగారు.
అనంతరం థియేటర్ లోపలికి ప్రవేశించి రాళ్లతో థియేటర్‌లోని అద్దాలను ధ్వంసం చేశారు. సినిమా వేయకపోతే.. నీ అంతుచూస్తామంటూ కుర్మ రాజమల్ల గౌడ్‌పై బెదిరింపులకి దిగారు. థియేటర్‌ని ధ్వంసం చేయడంతో పాటు తనపై బెదిరింపులకి దిగారంటూ బజ్జూర్ వినయ్ అతని స్నేహితులపై కుర్మ రాజమల్ల గౌడ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే డిసెంబరు నాలుగోతేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ట్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా బెనిఫిట్ షో వేశారు. అక్కడకు బన్నీ రావడంతో తోపులాట జరిగి దిల్ షుక్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనపై చిక్కడపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, పుష్ప2 టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది.