Pushpa2 : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరు ఒకే ఒక్క సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు పుష్ప2. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు బన్నీ. షూటింగ్ కూ పూర్తయినట్టు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా సాగుతోంది. ‘‘పుష్ప తో అయిదేళ్ల బంధం ముగిసింది. చివరి రోజు,చివరి షాట్.. వాట్ ఏ జర్నీ’ అంటూ బన్నీ పేర్కొన్నారు. రష్మిక, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. పుష్ప 2’ కి మంచి ఓపెనింగ్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ‘కిసిక్’ పాట కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. మొదటి భాగంలోని ‘‘ఊ అంటావా మావా’ పాటకు పోలిక తేవడంతో, కిసిక్ పాట జనాలకు అంత కిక్ ఇవ్వలేదు. చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది. అయితే పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరిగిందో అని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్ 30 అక్టోబర్ 2022 న హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. సినిమా మొదటి షెడ్యూల్ ముగిసిన తరువాత, రెండవ షెడ్యూల్ జనవరి 2023 లో విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇక్కడ పుష్ప రాజ్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ అక్కడ చిత్రీకరించారు. విశాఖపట్నం పోర్ట్‌లో 50 మంది స్టంట్‌మెన్‌లతో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం. ఈ సీన్‌లో అల్లు అర్జున్‌ను నేల నుంచి 100 అడుగుల ఎత్తులో తలకిందులుగా వెలదీస్తారని తెలుస్తోంది.
జనవరిలో షూటింగ్ ముగిసిన రెండు నెలల తర్వాత, అంటే మార్చి 2023లో, అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా బెంగుళూరులో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. బెంగళూరులో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 2023లో, పుష్ప 2 యొక్క జంగిల్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోతెరకెక్కించారు. ఈ షూటింగ్ కోసం ఈ ప్రాంతం చుట్టూ నివసించే చాలా మంది స్థానికులను కూడా నటింపజేశారు. ఆగస్టు 2023 తర్వాత ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరిగింది. అలాగే మార్చి 2024లో, ఆంధ్రప్రదేశ్‌లోని యాగంటి ఆలయంలో పుష్ప 2 యొక్క కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాలో కనిపించే జపాన్, మలేషియా సెట్స్ కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారు.