Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2. ఈ సినిమా కోసం దేశం మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. ‘పుష్ప-2’తో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ చరిత్ర సృష్టించనుందని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 4 రాత్రి నుండే ప్రీమియర్ షోల ప్రదర్శన జరగనుంది. యూఎస్ కంటే ముందు ఏపీ/తెలంగాణాలలో షోలు పడనున్నాయి. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. ఏకంగా మూడేళ్లు కష్టపడి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చిత్ర ప్రముఖులకు ఈ సినిమాను చూపించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ కాపీ నేను చూశానని, మగధీర చూశాక నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అదే ఫీలింగ్ పుష్ప 2 చూశాక కలిగింది అన్నారు ఓ ప్రముఖుడు. ఇక పుష్ప 2 కథకి సంబంధించిన వార్త కూడా ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. అల్లు అర్జున్, రష్మిక మందాన పెళ్లి సీన్తో పుష్ప పార్ట్ వన్ ముగుస్తుంది. కథ అక్కడే మొదలవుతుందట. శ్రీవల్లిని వివాహం చేసుకున్న పుష్పరాజ్… అంచెలంచెలుగా ఎదుగుతాడు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ మాఫియాను కనుసన్నల్లో నడిపించే కింగ్ అవుతాడు. పుష్పరాజ్ రేంజ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ కి విస్తరిస్తుంది. మరోవైపు షెకావత్ పగతో రగిలిపోతూ ఉంటాడు.
పుష్పరాజ్ ని కట్టడి చేయలేకపోతున్నానని ఆక్రోశం వెళ్లగక్కుతాడు. అసలు పుష్పరాజ్ నేర సామ్రాజ్యాన్ని ఎవరు ఎలా కంట్రోల్ చేశారు? పుష్పరాజ్ జీవితం స్మగ్లర్ గానే ముగిసిందా? ఆ క్యారెక్టర్ లో పాజిటివ్ షేడ్స్ ఏమైనా ఉన్నాయా? అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాలి. అల్లు అర్జున్ ఎంట్రీ షాట్ సినిమాకు హైలెట్ అట. ప్రతి పది నిమిషాలకు క్లైమాక్స్ ని తలపించే ట్విస్ట్, హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. జాతర ఎపిసోడ్, యాక్షన్ సీన్స్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అట. అల్లు అర్జున్ లుక్, మేనరిజం మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అంటున్నారు. అనసూయ రోల్, లుక్ కి విజిల్స్ పడతాయట అనసూయకు ఈ క్యారెక్టర్ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందని టాక్. సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్, జగపతిబాబు మధ్యలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయట. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టాడని అంటున్నారు.